Taliban: తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) దాడులు పాకిస్తాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను ఉద్దేశించి తాలిబాన్ ఒక వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో మునీర్‌కు స్పష్టమైన వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ సైన్యం తన సైనికుల ప్రాణాలను పణంగా పెట్టకుండా, బదులుగా ఉన్నత సైనికాధికారులే స్వయంగా యుద్ధరంగానికి రావాలని టీటీపీ అగ్ర కమాండర్ మునీర్‌ని బెదిరిస్తూ వీడియోలో హెచ్చరించారు. Read Also: PM Modi: రేపటి నుంచే బీహార్‌లో మోడీ ఎన్నికల…
PAK vs AFG: పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల మధ్య గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు, దాడులు జరిగి పలువురు సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు, క్రికెటర్లు కూడా మరణించారు. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం ఓ కొలిక్కి వచ్చింది.
Pakistan Afghanistan Ceasefire: ఎట్టకేలకు పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ దేశాలకు టర్కీ మధ్యవర్తిత్వం వహించింది. దోహాలో జరిగిన చర్చల సందర్భంగా వారం రోజుల భీకర సరిహద్దు ఘర్షణలను బ్రేక్ పడింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం తెల్లవారుజామున ప్రకటించింది. రాయిటర్స్ ప్రకారం.. కాల్పుల విరమణ సక్రమంగా అమలు చేసేలా చూసుకోవడానికి రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు నిర్వహించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని…
Taliban – Pakistan Meeting: ఆఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. రెండు దేశాల మధ్య చెలరేగిన ఘర్షణలలో భారీ కాల్పులు, బాంబు దాడుల తరువాత ప్రస్తుతం రెండు వైపులా కాల్పుల విరమణకు అంగీకరించాయి. తాజాగా ఆఫ్ఘన్ మీడియా.. ఖతార్ రాజధాని దోహాలో తాలిబన్లు, పాక్‌తో చర్చలు జరపవచ్చని నివేదించింది. ఈ సమావేశంలో ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపుపై ఇరు వర్గాలు చర్చించే అవకాశం ఉంది. ఆఫ్ఘన్ ప్రతినిధి బృందానికి రక్షణ మంత్రి…