Temple employees: పండగ పూట ఇలాంటి గిప్ట్ ఇచ్చారేంట్రా బాబు..
- దీపావళి సందర్భంగా ఉద్యోగులకు బోనస్‌లు, స్వీట్లు
- మహారాష్ట్ర విఠల్ ఆలయ సిబ్బందికి
- చికెన్ మసాలా ప్యాకెట్లు గిప్ట్ గా ఇచ్చిన బీజీవీ కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి పండుగను.. ఇంట్లో దీపాలతో … ఇంటిని అందంగా అలంకరించి.. సంతోషంగా జరుపుకుంటారు. పిండి వంటలు, కొత్త బట్టలు, టపాసులు. సంపద, శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందంతో కూడిన మేలు కలయికగా ఈ దీపావళి వేడుకలను జరుపుకుంటారు. లక్ష్మీపూజ, దీపాల వెలుగులు, పటాసుల మోతలు వినిపిస్తుంటాయి.దీపావళి పండగ చాలా మందికి ఎంతో స్పెషల్. దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. దేశంలో పలు కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఆయా యాజమన్యాలు బోనస్, గిఫ్ట్స్ అంటూ రకరకాల బహుమతులు ఇస్తున్నాయి. కొన్ని కంపెనీలు మరో అడుగు ముందుకేసి తమ సిబ్బందికి లగ్జరీ కార్లు, బైక్‌లు, నగలు, అపార్ట్‌మెంట్‌లను కూడా అందిస్తున్నాయి.
దీపావళి సందర్భంగా ఉద్యోగులకు బోనస్‌లు, స్వీట్లు ఇస్తుంటారు. అయితే ఓ ఆలయంలోని ఉద్యోగులకు మాత్రం దిపావళి గిఫ్ట్‌లుగా దిమ్మతిరిగే బహుమతులు రావడంతో అవాక్కయ్యారు. అంతేనా ఊరంతా ఏకమై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
Also Read
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
- CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
మహారాష్ట్రలోని పంఢర్‌పూర్‌లోని విఠల్ ఆలయం స్థానికంగా ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయంలో పనిచేసే ఉద్యోగులు అసాధారణమైన దీపావళి బహుమతిని అందుకున్నారు. విఠల్ ఆలయంలో పనిచేసే సెక్యూరిటీ గార్డులు నుంచి ఇతర ఉద్యోగులతో సహా అవుట్‌సోర్స్ సిబ్బంది మొత్తానికి దీపావళి గిఫ్ట్‌గా చికెన్ మసాలా ప్యాకెట్లను అందించారు. BVG కంపెనీ కంపెనీ ఆలయ ఉద్యోగులకు చికెన్ మసాలా ప్యాకెట్లు పంచడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
నిజానికి విఠల్ ఆలయం ఎంత పవిత్ర స్థలం. నిత్యం ఇక్కడికి లక్షలాది మంది భక్తులు ఎంతో నిష్టతో వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా శాఖాహారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పే పవిత్ర స్థలం ఇది. ఇంతటి పవిత్ర ఆలయంలో పనిచేసే ఉద్యోగులకు చికెన్ మసాలా ప్యాకెట్లు పంచడం స్థానికంగా చర్చకు దారితీసింది. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!