Pak- Afghan war: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య యుద్ధం మొదలైంది..? కాల్పుల్లో 12 మంది పాక్ సైనికులు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Afghanistan war: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య యుద్ధం మొదలైనట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ ఖయ్యానికి కాలుదువ్వే దాయాదిదేశం పాకిస్థాన్ ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌లోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు ధీటుగా ఆఫ్ఘన్ స్పందించింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థన్, పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. అక్టోబర్ 9న పాకిస్థాన్.. ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్, ఖోస్ట్, జలాలాబాద్, పాక్టికాలో TTP చీఫ్ నూర్ వలీ మెహ్సుద్‌ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసింది. తాజాగా పాకిస్థాన్ వైమానిక దాడులకుఆఫ్ఘనిస్థన్ ప్రతీకారం తీర్చుకుంది. ఆఫ్ఘనిస్థన్ 201వ ఖలీద్ బిన్ వలీద్ ఆర్మీ కార్ప్స్ అక్టోబర్ 11న పాకిస్థాన్ సైనిక పోస్టులపై దాడులు ప్రారంభించింది.
Also Read
- Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్‌డీ హై అలర్ట్!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
ఆఫ్ఘనిస్తాన్‌లోని అధికార తాలిబన్ ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ఘనిస్థన్ దళాలు అనేక పాకిస్థానీ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయి. కునార్, హెల్మండ్ ప్రావిన్సులలోని ఆఫ్ఘన్ సరిహద్దులో ఒక్కొక్క పాకిస్థానీ పోస్టును ధ్వంసం చేశాయి. పక్తియా ప్రావిన్స్‌లోని రబ్ జాజీ జిల్లాలో ఈ ఉదయం నుంచి ఆఫ్ఘన్ సరిహద్దు దళాలు, పాకిస్థాన్ దళాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఆఫ్ఘన్, పాకిస్థాన్ దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో 12 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని, మరో ఇద్దరు గాయపడ్డారని ఆఫ్ఘన్ కి చెందిన టోలో న్యూస్ ధృవీకరించింది. ఈ దాడుల్లో పాకిస్థాన్ సైన్యం గణనీయంగా నష్టపోయిందని వెల్లడించాయి. ఆఫ్ఘన్ దళాలు పాకిస్థాన్ సైనికుల నుండి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నాయని చెబుతున్నారు.. మరోవైపు.. తాలిబన్ పాలనలోని రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. “పాకిస్థాన్ ఆఫ్ఘన్ గగనతలాన్ని ఉల్లంఘించింది. డ్యూరాండ్ లైన్ సమీపానికి చెందిన పాక్టికా మార్గి ప్రాంతంలోని మార్కెట్‌పై బాంబు దాడి చేసింది. కాబూల్ సార్వభౌమ భూభాగాన్ని కూడా ఉల్లంఘించింది. ఇది హింసాత్మక, రెచ్చగొట్టే చర్య. ఆఫ్ఘన్ గగనతలాన్ని ఉల్లంఘించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా భూభాగాన్ని రక్షించుకోవడం మా హక్కు.” అని పేర్కొంది.
తాజావార్తలు
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్‌డీ హై అలర్ట్!
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
-
Bi-Monthly Salary: నెలలో రెండుసార్లు జీతాలు? ఇండియాలో శాలరీలు ఇచ్చే విధానం మారనుందా?
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!