Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- హైదరాబాద్‌లో జరిగిన ‘ది ప్యారడైజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్..
- ప్రత్యేక ఆకర్షణగా రాఘవ్ జుయల్
- స్లో మోషన్ డ్యాన్స్ స్టైల్‌తో అలరించిన రాఘవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghav Juyal: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో సినిమాలో కీలక పాత్రతో పాటు విలన్‌గా కనిపించనున్న రాఘవ్ జుయల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్టేజీపై తనదైన డ్యాన్స్ స్టైల్‌తో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
రాఘవ్ జుయల్ తన ప్రత్యేకమైన ‘స్లో మోషన్ డ్యాన్స్’తో ఈవెంట్లో సందడి చేశారు. ముందుగా ‘ఆయా షేర్’ పాటకు తన స్టైల్లో స్టెప్పులు వేసిన ఆయన.. ఆ తర్వాత యాంకర్ సుమతో కలిసి ‘ఏషనాగుల కట్ట మీద’ పాటకు కూడా డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా రాఘవ్ వేసిన స్లో మోషన్ స్టెప్పులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రాఘవ్ జుయల్ కేవలం నటుడిగానే కాకుండా డ్యాన్సర్, యాంకర్, టెలివిజన్ ప్రజెంటర్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ మొదటి సీజన్ ద్వారా ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. ఎలాంటి ఫార్మల్ డ్యాన్స్ ట్రైనింగ్ లేకపోయినా ‘క్రాక్ రోజ్’ అనే ప్రత్యేకమైన డ్యాన్స్ ఫామ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మొసలి తరహా పవర్ఫుల్ మూవ్స్, బొద్దింకలా స్లో మోషన్ మూవ్‌మెంట్స్‌ను కలిపి ఈ ప్రత్యేకమైన శైలిని రూపొందించారు.
Also Read
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
- Suriya - Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
- JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
ఆ తర్వాత రాఘవ్ జుయల్ సినిమాల్లోనూ తన సత్తా చాటారు. 2014లో ‘సోనాలి కేబుల్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన.. ‘అభయ్’ వెబ్ సిరీస్‌లో విలన్ పాత్రలో కనిపించారు. అనంతరం ‘కిల్’, ‘యుధ్ర’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. మరోవైపు షారుక్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ సినిమాలోనూ ఆయన కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో నానితో పాటు మోహన్ బాబు, కయాదు లోహర్, సోనాలి కులకర్ణి తదితరులు నటిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
ట్రెండింగ్
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!