Asia Cup 2023: హావ్వా…. ఫ్యాన్స్ లేక వెలవెలబోయిన పాక్ స్టేడియం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ( ఆగస్ట్ 30 ) ఆసియా కప్ 2023లో భాగంగా ముల్తాన్ వేదికగా నేపాల్‌తో పాకిస్థాన్ పోటీ పడుతుంది. అయితే, దాదాపు పదిహేనేళ్ల తరువాత పాక్ గడ్డపై మ్యాచ్ జరుగుతుండడంతో స్టేడియానికి ప్రేక్షకులు భారీగా వస్తారని అందరు అనుకున్నారు. కానీ, మ్యాచ్ స్టార్ట్ అయినా.. కాసేపటికే అదంతా భ్రమ అని తేలిపోయింది. బాంబుల భయంతో ప్రేక్షకులు.. తమ ప్రాణాలు కాపాడుకోవడానికే మొగ్గుచూపినట్లు మ్యాచ్ ను వీక్షేందుకు క్రికెట్ ఫ్యాన్స్ రాలేదనే కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
Read Also: Rythu Bharosa: కౌలు రైతులకు గుడ్‌న్యూస్.. రేపే ఖాతాల్లో నగదు జమ
Also Read
దాయాది పాకిస్తాన్ దేశంలో బాంబుల మోత ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. చివరికి చిన్న పిల్లలు చదువుకునే స్కూళ్లు, ప్రార్థనా మందిరాలను కూడా అక్కడి టెర్రరిస్టులు వదిలి పెట్టరు. ఈ క్రమంలో పాకిస్థాన్- నేపాల్ మ్యాచ్ జరుగుతోన్న ముల్తాన్ స్టేడియం ఖాళీగా దర్శనమిచ్చింది. దీంతో పలు ఊహాగానాలకు కారణమవుతోంది. బాంబుల భయంతో ప్రేక్షకులు ముల్తాన్ స్టేడియానికి రాలేదనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ స్టేడియం సామర్థ్యం 30వేలు కాగా, కేవలం 13వేల మంది హాజరైనట్లు తెలుస్తోంది. దీంతో స్టేడియంలోని అన్ని స్టాండ్లన్నీ ఖాళీగా కనిపించాయి.
Read Also: Babar Azam: వాహ్ బాబర్ ఆజామ్.. రికార్డ్ సెంచరీ నమోదు..
ఇక, కెప్టెన్ బాబర్ ఆజామ్ (131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 151 పరుగులు ) భారీ శతకంతో విరుచుకుపడడంతో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. దీంతో నేపాల్ ముందు 343 పరుగుల లక్ష్యం ఉంది. బాబర్ తో పాటు ఇప్తికార్ అహ్మద్ ( 71 బంతుల్లో 11ఫోర్లు, 4 సిక్సర్లతో 109 నాటౌట్ ) కూడా దంచి కొట్టడంతో పాక్ భారీ స్కోరు చేసింది. మిగిలిన వారిలో మహ్మద్ రిజ్వాన్(44) రాణించాడు. నేపాల్ బౌలర్లలో సోంపాల్ కామి రెండు వికెట్లు తీయగా కరణ్ కెసి, సందీప్ లామిచానేలు తలో వికెట్ తీసుకున్నారు.
https://twitter.com/teams_dream/status/1696816570411139240
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!