సురేందర్ రెడ్డి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈయన తన కెరీర్ లో మంచి సూపర్ హిట్ సినిమాలను అందించాడు.అలాగే భారీ డిజాస్టర్ సినిమాలను కూడా అందించాడు.రీసెంట్గా సురేంద్ర రెడ్డి తెరకెక్కించిన సినిమా ఏజెంట్. అక్కినేని అఖిల్ హీరోగా నటించాడు.సురేందర్ రెడ్డి తెరకెక్కించినఈ సినిమా అఖిల్ కెరీర్ లో భారీ డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా దెబ్బతినింది.ఏప్రిల్ 28న ఎంతో గ్రాండ్ గా విడుదల చేయగా డిజాస్టర్ టాక్ వచ్చింది. అనిల్ సుంకర పెట్టిన బడ్జెట్ లో సినిమా సగం కూడా రాబట్టలేక పోయింది. ఏజెంట్ సినిమా ప్లాప్ కావడంతో సురేంద్ర రెడ్డి తో సినిమా చేయడానికి ఏ హీరో కూడా సాహసం చేయడం లేదు..ఏ ప్రొడ్యూసర్ ఆయన దగ్గరకు కూడా రావడం లేదు.
అయితే తాజాగా ఒక మెగా హీరో సురేంద్ర రెడ్డి తో సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టు సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. సురేంద్ర రెడ్డితో సినిమా చేయడానికి ఆ మెగా హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.ఆ మెగా హీరో ఎవరంటే మెగా మేనల్లుడు అయిన పంజా వైష్ణవ్ తేజ్ అని సమాచారం. పంజా వైష్ణవ్ తేజ్ కు సురేందర్ రెడ్డి చెప్పిన స్టోరీ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ సమాచారం.ఇప్పుడు ఈ సినిమా కోసం సురేందర్ రెడ్డి ఒక పెద్ద నిర్మాతను వెతకడం మొదలు పెట్టాడు..ఈ సినిమాను తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కించబోతున్నట్లు సమాచారం..ఈ సినిమాకు వారు అనుకున్న నిర్మాత కనుక దొరికితే ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కూడా ఉంది. వైష్ణవ్ తేజ్ ప్రజెంట్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఆదికేశవ’.ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా జులై నెల చివరకు విడుదల చేసే అవకాశం ఉంది.ఉప్పెన వంటి బిగ్గెస్ట్ హిట్ సినిమా తరువాత అలాంటి భారీ హిట్ కోసం వైష్ణవ్ తెగ ప్రయత్నిస్తున్నాడు.