ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి 10 గంటలకు వైజాగ్‌కు వెళ్లనున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి మృతదేహానికి సీఎం నివాళులర్పించనున్నారు. ఆపై చంద్రమౌళి కుటుంబసభ్యులను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. పారిపోతున్న చంద్రమౌళిని ఉగ్రవాదులు వెంటాడి మరీ చంపిపారు. చంపొద్దని వేడుకున్నా.. ఉగ్రమూకలు వినకుండా చంద్రమౌళిని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సమాచారం తెలిసిన వెంటనే వైజాగ్ నుంచి కుటుంబసభ్యులు పహల్గాంకు బయల్దేరి వెళ్లారు. చంద్రమౌళి మృతదేహం ఇవాళ రాత్రి విశాఖకు…
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి చెందారు. కశ్మీర్ నరమేథంలో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. చంద్రమౌళి పారిపోతున్నా.. ఉగ్రవాదులు ఆయనను వెంటాడి మరీ చంపారు. చంపొద్దని వేడుకున్నా ఉగ్రమూకలు కనికరించలేదు. వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోమంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా ఉగ్రవాదుల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన 3 గంటల తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. సమాచారం తెలిసిన వెంటనే చంద్రమౌళి కుటుంబ సభ్యులు పహల్గాం…