Padmapriya : అందరి ముందే సినిమా సెట్‌లో ఆ డైరెక్టర్ కొట్టాడు : హీరోయిన్ పద్మప్రియ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Padmapriya : ప్రస్తుతం మలయాళ సినీ ఇండస్ట్రీలో ఏర్పాటు చేసిన హేమ కమిటీ రిపోర్ట్ సంచలనాలు సృష్టిస్తుంది. ఈ నివేదిక తర్వాత చాలా మంది ఉలిక్కి పడ్డారు. ఇండస్ట్రీలో ఆడవారు లైంగికంగా వేధింపులు ఎదుర్కొంటున్నారని.. అవకాశాల కావాలంటే దర్శకనిర్మాతలు చెప్పినట్లు వారి పక్కలోకి వెళ్లాలని లేకపోతే ఇండస్ట్రీలో ఛాన్స్ లు రాకుండా చేస్తారని మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారంటూ ఆ నివేదికలో పొందుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడి నటీమణులు కొందరు తమకు సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలను బయటకి చెప్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ తనకు జరిగిన సంఘటన గురించి మరోసారి చెప్పుకొచ్చింది.
Read Also:Israel-Iran War: ఒకప్పుడు స్నేహం చేసిన ఇజ్రాయెల్-ఇరాన్ బద్ధ శత్రువులుగా ఎలా మారాయి?
Also Read
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
తమిళ కుటుంబానికి చెందిన పద్మప్రియ తెలుగు సినీ పరిశ్రమలో శ్రీను వాసంతి లక్ష్మి అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళ్, మలయాళీ, హిందీ సినిమాలు చేసింది. ఎక్కువగా మలయాళంలోనే సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది పద్మప్రియ. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో పద్మప్రియ 2007లో తనకు జరిగిన సంఘటన గురించి మరోసారి మాట్లాడింది. 2007లో పద్మప్రియ ఓ తమిళ్ సినిమా చేస్తుండగా ఆ సినిమా డైరెక్టర్ సామి సినిమా సెట్లో అందరి ముందు పద్మప్రియను కొట్టాడు. అప్పట్లో ఇది పెద్ద వివాదంగా మారింది. ఆ తర్వాత ఆ డైరెక్టర్ పై ఒక ఏడాది పాటు బ్యాన్ విధించారు.
Read Also:Polena Anjana: పవన్ కల్యాణ్ చిన్న కుమార్తెను చూశారా?.. అక్కాచెల్లెళ్ల పిక్స్ వైరల్?
తాజాగా ఆ సంఘటనని గుర్తుచేసుకుంటూ పద్మప్రియ మాట్లాడుతూ.. నన్ను ఆ డైరెక్టర్ కొడితే కొంతమంది నేనే ఆ డైరెక్టర్ ని కొట్టానని నా పైనే ఆరోపణలు సృష్టించారు. మొదట్లో నా వాదనని ఎవరూ పట్టించుకోలేదు. మహిళల అనుభవాలను కొట్టి పారేస్తారు లేదా వాళ్లదే తప్పు అన్నట్లు చిత్రీకరిస్తారు. నాకు ఎదురైన అనుభవమే అందుకు ఉదాహరణ. ఆ ఘటన తర్వాత ఆ డైరెక్టర్ ని తమిళ పరిశ్రమ బ్యాన్ చేసింది. కానీ నేనే ఆ తర్వాత తమిళ సినిమాలు తగ్గించేశానని తెలిపింది. తెలుగులో శీను వాసంతి లక్ష్మి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పద్మప్రియ ఆ తర్వాత తెలుగులో అందరి బంధువయ, పటేల్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేస్తుంది. పద్మప్రియ భరతనాట్యం కళాకారిణి. ప్రస్తుతం మలయాళ పరిశ్రమలో వుమెన్ సేఫ్టీ గురించి పనిచేస్తుంది.
తాజావార్తలు
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!