TVK: నీట్‌ను పూర్తిగా రద్దు చేయాలి.. టీవీకే పార్టీ సంచలన డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVK: నీట్ (NEET) పేపర్ లీకేజీలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో తమిళనాడులోని అధికార పక్షం తమిళగ వెట్రి కజగం (TVK) తన స్వరాన్ని మరింత పెంచింది. తమిళనాడు ముఖ్యమంత్రి ‘దళపతి’ విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ, కేవలం నీట్ పరీక్షలో జరిగే అక్రమాలను వ్యతిరేకించడమే కాకుండా, ఈ జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్షను దేశవ్యాప్తంగా పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా, వైద్య విద్యకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తి అధికారాలు ఇవ్వాలని స్పష్టం చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో నీట్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసనలు ఉధృతమవుతున్న తరుణంలో, నీట్‌ను పూర్తిగా రద్దు చేయడమే తమ రాజీలేని, స్పష్టమైన వైఖరి అని టీవీకే ప్రకటించింది. గత 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే నీట్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఓట్లు దండుకున్నారని పరోక్షంగా ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. తాము అలా ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టే “కపట రాజకీయం” ఎప్పటికీ చేయబోమని తేల్చిచెప్పింది.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ‘ఉమ్మడి జాబితా’ (Concurrent List) లో ఉన్న విద్యా రంగాన్ని తిరిగి ‘రాష్ట్ర జాబితా’ (State List) లోకి మార్చాలని టీవీకే డిమాండ్ చేసింది. దీనికి ఏవైనా చట్టపరమైన లేదా సాంకేతికపరమైన అడ్డంకులు ఉంటే, తాత్కాలిక పరిష్కారంగా ఒక ప్రత్యేక ఉమ్మడి జాబితాను ఏర్పాటు చేసి, వైద్య విద్యతో సహా మొత్తం విద్యా రంగంపై రాష్ట్రాలకే పూర్తి అధికారాలు కల్పించాలని కోరింది. ఇతరుల కష్టాన్ని, ఆలోచనలను, పోరాటాలను తమ ఖాతాలో వేసుకుంటూ స్వార్థ రాజకీయం చేసేవారు టీవీకేను విమర్శించడం తక్షణమే ఆపాలని హితవు పలికింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!