Padma Shri Awards 2024: టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జోష్న చిన్నప్పలకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. క్రీడా రంగం నుంచి మొత్తం ఏడు మంది ఈ అవార్డుకు ఎంపికయ్యారు. రోహన్ బోపన్న రెండు దశాబ్దాల పాటు డేవిస్‌కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆసియా క్రీడల్లో డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ స్వర్ణం సాధించాడు. తాజాగా డబుల్స్‌లో ప్రపంచ నం.1గా నిలిచాడు. పద్మ అవార్డుల జాబితా గురువారం విడుదల అయింది. మార్చి లేదా ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమాలలో పద్మ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేస్తారు.
మరోవైపు జోష్న చిన్నప్ప కామన్వెల్త్ క్రీడల్లో డబుల్స్‌లో ఒక స్వర్ణం, ఒక రజతం సాధించారు. ఆసియా క్రీడల్లో టీమ్ విభాగంలో రెండు రజతాలు, రెండు కాంస్యాలు.. సింగిల్స్‌లో ఓ కాంస్యం కైవసం చేసుకుంది. 2022 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ డబుల్స్‌లో స్వర్ణం సాధించింది. హర్బిందర్ సింగ్ (హాకీ), పూర్ణిమ మహతో (ఆర్చరీ), సతేంద్ర సింగ్ లోహియా (స్విమ్మింగ్), గౌరవ్ ఖన్నా (బ్యాడ్మింటన్), ఉదయ్ విశ్వనాథ్ దేశ్‌పాండే (మల్లఖంబ)లు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీతల జాబితా:
హర్బిందర్ సింగ్ (హాకీ, కోచ్)
పూర్ణిమా మహతో (ఆర్చరీ, మాజీ క్రీడాకారిణి)
సతేంద్ర సింగ్ లోహియా (స్విమ్మింగ్, అథ్లెట్)
గౌరవ్ ఖన్నా (బ్యాడ్మింటన్, కోచ్)
ఉదయ్ విశ్వనాథ్ దేశ్‌పాండే (మల్లఖంబ, కోచ్)
జోష్నా చినప్ప (స్క్వాష్, అథ్లెట్)
రోహన్ మచ్చండ బోపన్న (టెన్నిస్, అథ్లెట్)