Site icon NTV Telugu

Asaduddin Owaisi: చైనా- భారత్‌ మధ్య ఒప్పందంపై అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Asaduddin Owaisi

Asaduddin Owaisi

భారత్‌-చైనా మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం నేపథ్యంలో బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. తూర్పు లడఖ్‌లోని పెట్రోలింగ్ పాయింట్లకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. మరోవైపు ఈ అంశంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటన వెలువడింది. మోడీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని చైనా మన దేశంలోకి ప్రవేశించిందని ఒవైసీ అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని తెలిపారు.

READ MORE: Kolkata Doctor Case: కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో కీలక పరిణామం.. టీఎంసీ యువనేతతో లింక్స్..

నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది..
ఓ వార్తా ఛానెల్‌తో ఒవైసీ మాట్లాడుతూ.. “గాల్వాన్‌లో ఘర్షణ జరిగినప్పుడు, చైనా తన దేశ భూమిలోకి ప్రవేశించిందని మేము చెప్పాం. మోడీ ప్రభుత్వం ఈరోజు చైనాతో ఒప్పందం కుదుర్చుకుందంటే.. నాలుగేళ్ల క్రితం ప్రధాని దేశానికి అబద్ధాలు చెప్పారని అర్థం. ప్రభుత్వం చేస్తున్న రాజీ మార్గాన్ని నేనూ, మీరూ చూడలేదు. అందుకే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతాం.” అని పేర్కొన్నారు.

READ MORE: Kolkata Doctor Case: కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో కీలక పరిణామం.. టీఎంసీ యువనేతతో లింక్స్..

ఒవైసీ ఇంకా ప్రశ్నలు లేవనెత్తారు. అక్టోబర్‌లో ఎస్‌ఏసీ చుట్టూ హిమపాతం ప్రారంభమైతే.. పెట్రోలింగ్ గురించి మాట్లాడుతున్న 25 పాయింట్లు ఎలా తెలుస్తాయని అన్నారు. దీనిపై మనకు ఏప్రిల్‌లో మాత్రమే క్లారిటీ వస్తుందని తెలుస్తుంది. 4 సంవత్సరాలుగా మన సైన్యం అక్కడ కూర్చుంటే.. సైన్యం తిరిగి వస్తుందా? అని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు డీ-ఎస్కలేషన్, డీ-ఇండక్షన్ ఉంటుందా అన్నదే మన ప్రశ్న అని అన్నారు. మన సైన్యం మళ్లీ 25 పెట్రోలింగ్ పాయింట్ల వద్ద గస్తీ తిరుగుతుందా? అని ప్రశ్నించారు.

Exit mobile version