దక్షిణ కొరియా వేదికగా ట్రంప్-జిన్‌పింగ్ సమావేశం అయ్యారు. ఆరేళ్ల తర్వాత ఇద్దరు నాయకులు కలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. బుసాన్‌లో జరుగుతున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
భారత్-చైనా మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం నేపథ్యంలో బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. తూర్పు లడఖ్‌లోని పెట్రోలింగ్ పాయింట్లకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.