భారత్-చైనా మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం నేపథ్యంలో బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. తూర్పు లడఖ్‌లోని పెట్రోలింగ్ పాయింట్లకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.
పొరుగు దేశం చైనా తన చేష్టలను వదిలిపెట్టడం లేదు. తూర్పు లడఖ్‌లో చైనా తన ఉనికిని పటిష్టం చేసుకునే పనిలో రోజురోజుకూ బిజీగా ఉంది. తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు పరిసర ప్రాంతాల్లో కూడా చైనా సైన్యం చాలా కాలంగా తవ్వకాలు జరుపుతోంది.
చైనా ప్రపంచ శక్తిగా మారేందుకు ప్రయత్నిస్తోందని త్రిధళాధిపతి జనరల్ బిపిన్ రావత్ అన్నారు. చైనా-పాక్ సంబంధంపై మాట్లాడిన బిపిన్.. ఆ దేశాల మధ్య ఉన్న సంబంధం భారత్‌కు వ్యతిరేకం అని అన్నారు. అంతేకాకుండా వివిధ దేశాలలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు చైనా సిద్ధమైందని, ఫలితంగా ఆ దేశాలపై పట్టు సాధించేందుకు ఎత్తుగడలు వేస్తోందని అన్నారు. దక్షిణాసియాలో చైనా చర్యలు ప్రమాదకరంగా మారుతున్నాయని ఆయన అన్నారు. భారత సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. చైనా బలమైన దేశమైనా,…