New York: న్యూయార్క్‌లో బైబ్యాక్ కార్యక్రమం.. గిఫ్ట్‌కార్డుల కోసం తుపాకులను వదిలేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New York: అమెరికా గన్‌కల్చర్ గురించి అందరికి తెలిసిన విషయమే. అగ్రరాజ్యంలో ఎక్కడో ఓ చోట గన్ సౌండ్ వినబడుతూనే ఉంటుంది. ఆ గన్‌కల్చర్‌కు అడ్డుకట్టు వేయడానికి న్యూయార్క్ ఓ సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహించింది. తుపాకులను వెనక్కి ఇచ్చిన వారికి గిఫ్ట్ కార్డులు అందిస్తామని ప్రకటించింది. న్యూయార్క్ బైబ్యాక్ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత న్యూయార్క్‌లో వేల సంఖ్యలో తుపాకులను వెనక్కి ఇచ్చారు. ప్రమాదకరమైన ఆయుధాలను వదిలిపెట్టిన తుపాకీ యజమానులకు బదులుగా 500 డాలర్ల విలువైన బహుమతి కార్డులను అందించినట్లు ది గార్డియన్ తెలిపింది. న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ కార్యాలయం ఈ బైబ్యాక్ కార్యక్రమాన్ని నిర్వహించింది. 3,000 కంటే ఎక్కువ తుపాకులు వదులుకున్నట్లు తెలిసింది. వీటిలో అస్సాల్ట్-స్టైల్ రైఫిల్స్, ఘోస్ట్ గన్‌లు ఉన్నాయి. ఈ తుపాకులు అసెంబ్లింగ్ చేయకుండా విక్రయించిన తుపాకీ భాగాల నుంచి నిర్మించబడ్డాయని అవుట్‌లెట్ తన నివేదికలో పేర్కొంది. తాము ఈ రోజు 3,076 తుపాకులను స్వాధీనం చేసుకున్నామని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ తెలిపారు. ఇందులో 185 దాడి ఆయుధాలు ఉన్నాయన్నారు.
Read Also: BJP Manifesto: ఉచిత పాలు, ఉచిత సిలిండర్లు, యూనిఫాం సివిల్ కోడ్.. బీజేపీ హామీల వర్షం
Also Read
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
న్యూయార్స్ వీధుల్లో నుంచి, ఇళ్ల నుంచి తుపాకులను బయటకు తీసుకురావడానికి సహాయం చేసిన వారంందరికీ, అధికారులకు న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ధన్యవాదాలు తెలిపారు. తుపాకీ హింస నుంచి న్యూయార్క్‌వాసులను రక్షించడానికి చేయగలిగినదంతా చేస్తామన్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా తెలిపారు. తుపాకులను ఇచ్చిన వారికి 500 డాలర్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. అటార్నీ జనరల్ కార్యాలయం న్యూయార్క్ అంతటా తొమ్మిది బైబ్యాక్ స్థానాలను ఏర్పాటు చేసింది. సిరక్యూస్‌లో అత్యధికంగా రికార్డు స్థాయిలో తుపాకులను అధికారులకు అందజేసినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. ఒక్క చర్చిలోనే 90 తుపాకులు సేకరించినట్లు బ్రూక్లిన్ జిల్లా అటార్నీ ఎరిక్ గొంజాలెజ్ ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!