బాలీవుడ్ క్వీన్ ప్రియాంక చోప్రా మేనకోడలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పరిణీతి చోప్రా. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇండియాస్ టాప్ 100 సెలబ్రిటీస్ లిస్టులో 2013 నుంచి చోటు దక్కించుకున్న పరిణీతి చోప్రా, బాలీవుడ్ లోకి ‘లేడీస్ Vs రిక్కీ భల్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ‘ఇషాక్ జాదే’ సినిమాకి గాను స్పెషల్ మేన్షన్ కేటగిరిలో నేషనల్ అవార్డు గెలుచుకున్న పరిణీతి చోప్రాకి ‘ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా’తో ఎంగేజ్మేంట్ అయ్యింది. గత కొంతకాలంగా అప్పుడప్పుడు కలిసి కనిపిస్తున్న ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారు అనే వార్త వినిపిస్తూనే ఉంది. పరిణితి చోప్రా, రాఘవ్ చద్దాలు తన రిలేషన్ గురించి ఓపెన్ అవ్వలేదు కానీ ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు అని బాలీవుడ్ మీడియా కథనాలని మాత్రం ప్రచురించింది.
ఈ వార్తలని నిజం చేస్తూ పరిణీతి, రాఘవ్ లు పెళ్లికి సిద్ధమయ్యారు. ఢిల్లీలోని కపూర్తలా హౌజ్ లో ఈ ఇద్దరి నిశ్చితార్థ వేడుక జరిగింది. రెండు కుటుంబాల సభ్తోయులతో పాటు కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా నిశ్చితార్థ వేడుకకి విచ్చేసారు. ఈ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోస్ ని ప్రియాంక చోప్రా ఇన్స్టాలో పోస్ట్ చేసింది. “Congratulations Tisha and Raghav… Cannot wait for the wedding! So happy for you both and the families❤️ so fun to catch up with the fam!” అంటూ ప్రియాంక చోప్రా కోట్ చేసింది. ప్రస్తుతం పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దాల ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.