OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
- అనంతపురం మేయర్ సీటు పట్టుబట్టి తీసుకున్న బీజేపీ
- మేయర్ అభ్యర్థిగా కొత్త నాయకుడు అజేష్ యాదవ్
- వైసీపీ అభ్యర్థి రమేష్‌గౌడ్ లోకల్‌గా సుపరిచితుడన్న పేరు
- టీడీపీ ఎమ్మెల్యే మీది వ్యతిరేకత ప్రభావం పడుతుందని బీజేపీ భయం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: ఏపీలో మిగతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఒక ఎత్తు, ఆ ఒక్కటీ మరో ఎత్తు అన్నట్టుగా మారిందా? లోకల్ బాడీ ఎలక్షన్ కోసం స్టేట్ లెవల్, నేషనల్ లెవల్ లీడర్స్ ఎందుకు తరలి వస్తున్నారు? అదే సమయంలో అధికార పక్షంలోని లూప్‌హోల్స్ ప్రతిపక్షానికి వరంలా మారుతున్నాయా? పైగా పవర్ ఉన్న వాళ్ళు ఇస్తున్న ఒక్కో హామీని విశ్లేషించి వైసీపీ చీల్చి చెండాడుతోంది ఎక్కడ? ఆ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకత ఏంటి? ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేడి క్లైమాక్స్‌కు చేరుతోంది. అన్ని చోట్లా హోరా హోరీ ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ సమరం మాత్రం అన్నిటికంటే ఇంకొంచెం ఎక్కువ అన్నట్టు మారిపోయిందట. ఇది కేవలం ఒక స్థానిక సంస్థల ఎన్నిక కాదు… ఒక జీవన్మరణ సమస్య అన్నట్టు మారిపోయిందని అంటున్నారు. కీలకమైన అనంతపురం మేయర్ సీటును పట్టుబట్టి తీసుకుంది బీజేపీ. ఇక్కడ ఒక కొత్త ముఖాన్ని పరిచయం చేయాలని భావించిన కమలం నాయకత్వం…. డాక్టర్ విక్రమ్‌ను రంగంలోకి దించాలని మొదట్లో గట్టి ప్రయత్నాలు చేసింది.
కానీ, బలంగా ఉన్న ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టాలంటే సామాజిక సమీకరణాలు, క్షేత్రస్థాయి వ్యూహాలు అవసరమని భావించి.. ఆఖరి నిమిషంలో అజేష్ యాదవ్‌ను తెరపైకి తెచ్చింది. కానీ… అజేష్ కొత్త వ్యక్తి కావడమే ఇప్పుడు కూటమికి ఒక పెద్ద సవాల్‌గా మారిందని అంటున్నారు. దీనికి పూర్తి భిన్నంగా వైసీపీ తరపున నిలిచిన బీసీ నేత రమేష్ గౌడ్ నగరంలో అందరికీ సుపరిచితుడు, వివాదరహితుడు. పార్టీలోని అన్ని వర్గాలను కలుపుకుని పోతున్నారన్న పేరుంది ఆయనకు. దీంతో… బీజేపీ పెద్దలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. పట్టుబట్టిమరీ సీటు తీసుకోవడం, తమ అభ్యర్థి కొత్త కావడం, లోకల్‌గా తమ బలం, టీడీపీ సహకారం ఎంతవరకు అంటుందన్న అనుమానం, అలాగే లోకల్ టీడీపీ ఎమ్మెల్యే మీదున్న వ్యతిరేకత లాంటివన్నీ కలగలిసి ఎక్కడ తమ అభ్యర్థి విజయావకాశాలను దెబ్బ కొడతాయోనంటూ కమల నాథులు తెగ కంగారు పడుతున్నారట. ఇంకా చెప్పాలంటే… అనంతపురం మేయర్ సీటు గెలిపించుకోవడం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు సవాల్‌గా మారిందంటున్నారు పరిశీలకులు. అందుకే పార్టీ తరపున హేమాహేమీలను ప్రచార పర్వంలోకి దించారట. ఎంపీ పురందేశ్వరి, ఆర్. కృష్ణయ్య, సినీనటుడు సాయికుమార్, లాంటి అగ్రనేతలంతా ఇక్కడ ప్రచారంలో పాల్గొంటున్నారు.
Also Read
- Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
- OTR: మాగంటి బాబును పక్కన పెట్టిన టీడీపీ పెద్దలు.! మాగంటి రాజకీయానికి బ్రేక్ పడినట్టేనా?
- OTR: మహబూబాబాద్ కాంగ్రెస్‌లో ముసలం.. ఎమ్మెల్యే మురళీ నాయక్‌పై సొంత పార్టీ నేతల గుర్రు!
- OTR: జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?
అయితే… ఈ ప్రతిష్టాత్మక ఎన్నికల్లో కూటమికి బయటి వాళ్ళకంటే… అంతర్గత సమస్యలే పెద్ద ప్రమాదకరంగా మారే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు, స్థానిక నేతల మధ్య ఉన్న అలకలు ఎక్కడ కూటమి కొంపముంచుతాయోనని బీజేపీ అగ్రనాయకత్వం ఆందోళన చెందుతోందట. ఈ విభేదాలు కూటమి విజయానికి అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో, మంత్రి సత్యకుమార్ స్వయంగా రంగంలోకి దిగి సంధి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులను ఏకం చేసి, విభేదాలన్నింటినీ పక్కన పెట్టి కూటమి అభ్యర్థి కోసం పని చేసేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఆ క్రమంలో ఇస్తున్న కొన్ని భారీ హామీలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. అనంతపురంలో ట్యాంక్ బండ్ నిర్మాణం, ఎయిర్పోర్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, భూగర్భ కేబులింగ్ అంటూ… చాలా పెద్దపెద్ద హామీలే ఇస్తున్నారు కూటమి నేతలు. అగే పాయింట్‌ను తనకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నంలో ఉంది వైసీపీ. వాళ్ళు చెబుతున్నవాటన్నిటినీ నమ్ముతారా? అనంతపురంలో ఎయిర్ పోర్ట్, భూ గర్భ కేబులింగ్ అంటే నమ్ముతారా ? అవన్నీ కల్లబొల్లి కబుర్లు అంటూ మైండ్ గేమ్ మొదలుపెట్టింది విపక్షం. కూటమి నేతలు ఇస్తున్న ఒక్కో హామీకి, ప్రస్తుత పరిస్థితుల్ని జోడిస్తూ…వైసీపీ స్టార్ట్ చేసిన గేమ్ ఆసక్తి రేపుతోంది. పక్కా వ్యూహం ప్రకారం ప్రతిపక్షం చేస్తున్న ఈ ప్రచారం ఇప్పుడు అనంతపురం మున్సిపల్ పోరును మరింత ఉత్కంఠభరితంగా మార్చేసింది.
తాజావార్తలు
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
-
Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
-
Vishwak Sen: ‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకో చెప్పిన విశ్వక్సేన్!
-
GITAM University: గీతం యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం.. ఈగిల్ ఫోర్స్ విచారణ
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!