Vishwak Sen: ‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకో చెప్పిన విశ్వక్సేన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన తాజా చిత్రం ‘కల్ట్’. గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా అక్టోబరు 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ‘ఫలక్‌నుమా దాస్’ తర్వాత విశ్వక్ మళ్లీ మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన సినిమా కావడంతో దీనిపై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. సరిగ్గా రిలీజ్ ముంగిట నిర్వహించాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో హీరో విశ్వక్సేన్ తీసుకున్న ఒక అనూహ్య నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
గురువారం అత్యంత ఘనంగా నిర్వహించాల్సిన ‘కల్ట్’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు విశ్వక్సేన్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న ‘అర్నబ్’ తుపాను బీభత్సాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రకృతి విపత్తుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో వేడుకలు చేసుకోవడం సరికాదని ఆయన భావించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియో రిలీజ్ చేస్తూ.. ఈవెంట్‌ను రద్దు చేయడానికి గల కారణాన్ని అభిమానులతో పంచుకున్నారు.
Also Read
కేవలం ఈవెంట్ రద్దు చేయడమే కాకుండా, తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు అందరూ తోడుగా నిలబడాలని విశ్వక్సేన్ పిలుపునిచ్చారు. క్లిష్ట సమయంలో బాధితులకు అండగా ఉండటమే మన ప్రథమ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా సినిమా రిలీజ్‌కు ముందు మైలేజ్ కోసం ఎంతటి పరిస్థితుల్లోనైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లను నిర్వహించడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు. కానీ విశ్వక్సేన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ నుంచి పాజిటీవ్ కామెంట్స్ వస్తున్నాయి. ఈవెంట్ రద్దయినప్పటికీ, సినిమా మాత్రం ముందుగా ప్రకటించిన విధంగానే అక్టోబరు 30న థియేటర్లలో విడుదల కానుంది. మరోసారి డైరెక్టర్ క్యాప్ పెట్టి విశ్వక్ చేసిన ఈ ప్రయోగం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Let’s stand with AP . #CULT https://t.co/dS14kYwOPx
— VishwakSen (@VishwakSenActor) October 28, 2026
తాజావార్తలు
-
Vishwak Sen: ‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకో చెప్పిన విశ్వక్సేన్!
-
GITAM University: గీతం యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం.. ఈగిల్ ఫోర్స్ విచారణ
-
Cyberabad Traffic Plan: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌కు చెక్.. సైబరాబాద్ పోలీసుల కొత్త ప్లాన్
-
MEA: పశ్చిమాసియా ఘర్షణల్లో 22 మంది భారతీయులు మృతి..
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
ట్రెండింగ్
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..