సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వాలని కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.. అందులో కొన్ని విచిత్రంగా అనిపిస్తే మరికొన్ని మాత్రం విరక్తి కలిగిస్తుంటాయి.. అందులో ఫుడ్ కు సంబందించిన వీడియోలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి.. రోజుకో వింత వంటను పరిచయం చేస్తున్నారు.. వీటిని చూసిన వారంతా ఇలాంటి దరిద్రమైన ఐడియాలు మీకు ఎలా వస్తాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. తాజాగా మరో వింత వంట వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..
విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్‌తో కూడిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం సందడి చేస్తుండడం అందరికీ తెలిసినదే. సాధారణంగా మనిషి ఆహార ప్రియుడు. అందుకే సోషల్ మీడియా వేదికగా అనేకమంది నేడు ఫుడ్ కి సంబందించిన వ్లాగ్స్ చేస్తూ వుంటారు. అయితే ఇక్కడ అన్ని ఫుడ్ కాంబోలు నెటిజన్లను ఆకట్టుకోలేవు. చిత్ర విచిత్ర ఫుడ్ కాంబినేషన్‌లపై నెటిజన్లు పెదవివిరుస్తుంటారు. లేటెస్ట్‌గా ఓరియో ఫ్రైడ్ రైస్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.. ఓరియో బిస్కెట్ లవర్స్ ఈ కొత్త డిష్ ను చూసి వాంతి చేసుకోవడం ఖాయమనే చెప్పాలి..
అవును.. నిజంగా చూస్తే అదే జరుగుతుంది.. అయితే కొంతమంది ఔత్సాహికులు స్వీట్, సేవరీ టేస్ట్ యమ్మీ ఇష్టపడినా… మరికొందరు మాత్రం ఇదేం కాంబినేషన్ అంటూ పెదవి విరుస్తున్న పరిస్థితి. ఇన్‌స్టాగ్రాం మీమ్ పేజ్ తొలుత ఈ వీడియోను షేర్ చేయగా ఈ యూనిక్ డిష్ ప్రిపరేషన్ క్లిప్ ప్రస్తుతం నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ వీడియోని ఒక్కసారి పరిశీలిస్తే… ముందుగా ఓ వ్యక్తి పాన్‌లో నూనెను వేడి చేస్తూ అందులో పలు ఓరియో బిస్కెట్లను ముందుగా వేసాడు. తరువాత బిస్కెట్లు మెత్తగా అయ్యేందుకు కుక్ హాట్ ఆయిల్‌లో చాక్లెట్ పేస్ట్‌ను మిక్స్ చేయడం ఆ వీడియోలో చూడవచ్చు.. దానిపైన రైస్ వేసి క్యారెట్ ముక్కలు కొన్ని రకాల సాస్ లు కూడా వేసాడు.. చివరగా స్ప్రింగ్ అనియన్స్ తో డెకరేట్ చేశాడు.. ఈ డిష్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.. మొత్తానికి వీడియో హాట్ టాపిక్ అవుతుంది..