Site icon NTV Telugu

Opposition Meet: ఆగస్ట్ 15 తర్వాతే ముంబయిలో ప్రతిపక్ష కూటమి మూడో సమావేశం!

India

India

Opposition Meet: ప్రతిపక్ష కూటమి ‘ఇండియా'(ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) తన మూడో సమావేశాన్ని ఆగస్టు 15 తర్వాత లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ముంబైలో నిర్వహిస్తుందని కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే శుక్రవారం ప్రకటించారు. 26 పార్టీలతో కూడిన ప్రతిపక్ష కూటమి గతంలో జూలై 17-18 తేదీల్లో బెంగళూరులో సమావేశమైంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సమావేశం అనంతరం కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే మాట్లాడుతూ.. సెప్టెంబర్ మొదటి వారంలో సమావేశాన్ని షెడ్యూల్ చేయాలని కాంగ్రెస్ సూచించిందని చెప్పారు. అయితే తేదీలు ఇంకా ఖరారు కాలేదని ఆయన తెలిపారు.

Also Read: Minister Amarnath: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులా.. టీడీపీకి అధ్యక్షులా..?

‘ఇండియా’ కూటమిలో ఏ సభ్యుడు కూడా అధికారంలో లేని రాష్ట్రంలో ప్రతిపక్ష సమావేశం జరగడం ఇదే తొలిసారి. విపక్ష పార్టీల మొదటి సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూ పాట్నాలో ఆతిథ్యం ఇవ్వగా, రెండోది బెంగళూరులో జరగగా.. కాంగ్రెస్ ఆతిథ్యం ఇచ్చింది. ముంబైలో జరిగే సమావేశానికి శివసేన (యూబీటి), ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, కాంగ్రెస్ ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది.

జులై 17-18 తేదీల్లో బెంగ‌ళూరులో 26 పార్టీల ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ రెండో స‌మావేశం జ‌రిగిన త‌ర్వాత, గ్రూపింగ్‌కు కన్వీనర్‌ను నియమించేందుకు కూటమి 11 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.”మేము 11 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తాము. కమిటీ కన్వీనర్‌గా ఎవరు ఉండాలనే దానిపై సమావేశం నిర్వహిస్తుంది. సమావేశం ముంబైలో జరుగుతుంది” అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఒక సమావేశం తర్వాత సంయుక్త విలేకరుల సమావేశంలో అన్నారు.

Also Read: Online Love Story: ప్రియుడిని పెళ్లాడేందుకు చైనా నుంచి పాకిస్థాన్‌కు.. సరిహద్దు దాటిన మరో ప్రియురాలు

ప్రత్యేక సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట కమిటీల ఏర్పాటుతో పాటు ప్రచార నిర్వహణ కోసం ఢిల్లీలో ఉమ్మడి సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఖర్గే వెల్లడించారు. ఈ సమావేశంలో సంయుక్త ప్రకటనను ఆమోదించినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో కొంతమంది సభ్యుల మధ్య ఉన్న విభేదాలను ఆయన అంగీకరించారు. అయితే ఈ విభేదాలు సైద్ధాంతికమైనవి కాదని, ప్రజల అభివృద్ధి కోసం వాటిని పక్కన పెట్టవచ్చని అన్నారు. రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను సవాలు చేసేందుకు ఐక్య వ్యూహాన్ని రూపొందించడానికి బెంగళూరులో 26 ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతల రెండు రోజుల సమావేశంలో విస్తృతమైన చర్చలు జరిగాయి.

Exit mobile version