OPPO K13 Turbo, Turbo Pro: చైనాలో ఒప్పో తాజాగా రెండు ఫోన్ లను లాంచ్ చేసింది. OPPO K13 టర్బో, OPPO K13 టర్బో ప్రో పేర్లతో వీటిని లాంచ్ చేసింది. వీటిలో కొత్త ఫీచర్ గా యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ ను జత చేశారు. మొబైల్ ఫోన్లలో ఫ్యాన్ కూలింగ్ టెక్నాలజీకి ఇది ఒప్పో పరిచయం చేసిన అత్యుత్తమ మోడల్‌గా నిలవనుంది. మరి ఈ కొత్త మొబైల్స్ వివరాలను తెలుసుకుందామా..
ఈ ఫోన్‌లు 6.8 అంగుళాల 1.5K AMOLED ఫ్లాట్ డిస్‌ప్లేతో లాంచ్ అయ్యాయి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1600 నిట్స్ పీక్స్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక K13 Turbo మోడల్‌లో Dimensity 8450 (4nm) ప్రాసెసర్ ఉంటుంది. అలాగే K13 Turbo Pro మోడల్‌లో తొలిసారిగా Snapdragon 8s Gen 4 (4nm) ప్రాసెసర్ ఉపయోగించారు. ఈ రెండు ఫోన్‌లు 12GB లేదా 16GB LPDDR5X RAMతో పాటు 256GB నుంచి 1TB వరకు UFS 3.1 Turbo లేదా UFS 4.0 Turbo Pro స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి.
Off The Record : బాల్కొండ బీజేపీలో కలవరం.. పక్క చూపులు చూస్తున్న పార్టీ కేడర్..
ఇక కెమెరా విషయానికి వస్తే.. 50MP ప్రధాన వెనుక కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 16MP సెల్ఫీ కెమెరా ఉండనున్నాయి. వీటిలో డిస్‌ప్లేలోనే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక ఈ ఫోన్‌ల హైలైట్ గా చెప్పుకోవాల్సింది శక్తివంతమైన కూలింగ్ వ్యవస్థ. యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ ఉపయోగించి రాపిడ్ కూలింగ్ ఇంజిన్ ద్వారా గాలిని 120% పెంచుతూ, వేడిని 20% తక్కువ చేస్తుంది. L-షేప్‌డ్ అల్ట్రా-లో విండ్ రెసిస్టెన్స్ ఎయిర్ డక్ట్, మైక్రో సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్ ఉపయోగించి వేడి తగ్గిస్తుంది. ఈ ఫ్యాన్ మాడ్యూల్ బరువు కేవలం 2.8 గ్రాములు మాత్రమే.

Crime News: దారుణం.. భార్య, మామ చేతిలో భర్త హత్య..!
ఇక ఈ మొబైల్ 7000mAh బ్యాటరీతో వచ్చినా, ఫ్యాన్ వలన ఫోన్ మందంగా ఉండకుండానే కాస్త స్లిమ్ గానే డిజైన్ చేశారు. ఈ ఫోన్‌లు IPX6, IPX8, IPX9 వాటర్ ప్రూఫ్ సర్టిఫికేషన్‌తో వస్తున్నాయి. వేడి నీరు, నీటిలో ముంచడం, స్ప్రే చేయడం వంటి వాటికి కూడా రక్షణ కలిపిస్తుంది. ఇది మొబైల్ ఇండస్ట్రీలో తొలి పూర్తి వాటర్‌ప్రూఫ్ ఎయిర్ కూలింగ్ టెక్నాలజీ. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో Android 15 (ColorOS 15), స్టెరియో స్పీకర్లు, డ్యూయల్ 5G, Wi-Fi 6, Bluetooth 5.4, NFC, GPS, USB Type-C ఆడియో, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి.
OPPO K13 Turbo ధరలు (చైనా మార్కెట్):
* 12GB + 256GB – 1799 యువాన్స్ (రూ. 21,610 )
* 16GB + 256GB – 1999 యువాన్స్ (రూ. 24,020 )
* 12GB + 512GB – 2299 యువాన్స్ (రూ. 27,625 )
OPPO K13 Turbo Pro ధరలు:
* 12GB + 256GB – 1999 యువాన్స్ (రూ. 24,020 )
* 16GB + 256GB – 2199 యువాన్స్ (రూ. 26,420 )
* 12GB + 512GB – 2399 యువాన్స్ (రూ. 28,820 )
* 16GB + 512GB – 2699 యువాన్స్ (రూ. 32,425 )
వీటితోపాటు ఒప్పో సరికొత్త Super Cooling Kit కూడా విడుదల చేసింది. ఇది లిక్విడ్ కూలింగ్ మాగ్నెటిక్ కేస్, 27W TEC యాక్టివ్ కూలింగ్ బ్యాక్ క్లిప్‌తో వస్తుంది. దీని ధర 349 యువాన్స్ (రూ. 4,190). కానీ K13 Turbo కొనుగోలుతో కేవలం 299 యువాన్స్ (రూ. 3,590)కి లభిస్తుంది. ఈ ఫోన్‌లు జూలై 25 నుంచి చైనాలో అమ్మకానికి లభ్యం కానున్నాయి. భారత మార్కెట్లో విడుదలపై ఇంకా అధికారిక సమాచారం లేదు.