OPPO K13x 5G: తాజాగా ఓప్పో భారత్ లో తన సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ OPPO K13x ను లాంచ్ చేసింది. ‘K’ సిరీస్ లో భాగంగా విడుదలైన ఈ మొబైల్ అత్యాధునిక ఫీచర్లను అతి తక్కువ ధరతో వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. మరి ఇంత తక్కువ ధరలో ఒప్పో ఎటువంటి ఫీచర్లను అందించిందో ఒకసారి చూసేద్దామా..
డిస్ప్లే:
ఈ ఫోన్ 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉండి, 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పాండా గ్లాస్ ప్రొటెక్షన్ వంటి ప్రత్యేకతలతో వస్తోంది. ఈ డిస్ప్లేను తడి చేతులతోనూ స్క్రీన్‌ను సులభంగా ఆపరేట్ చేయగల ‘స్ప్లాష్ టచ్’ టెక్నాలజీ ఈ సెగ్మెంట్‌లో మొట్టమొదటిసారి తీసుకొచ్చారు.

Read Also:Rishabh Pant: రిషబ్ పంత్‌పై నిషేధం పడుతుందా?
ప్రాసెసర్:
ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ColorOS 15 మీద పని చేసే ఈ డివైస్‌కు రెండు ప్రధాన OS అప్‌డేట్స్, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందనున్నాయి. ఇక హార్డ్‌వేర్ పరంగా చూస్తే ఈ మొబైల్లో మీడియాటెక్ డిమెంసిటీ 6300 ప్రాసెసర్, ARM Mali-G57 GPU లు కలిగి ఉన్నాయి.

స్టోరేజ్:
ఈ మొబైల్ 4GB/6GB/8GB LPDDR4X RAM (వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో) అందుబాటులో ఉన్నాయి. మరోవైపు 128GB లేదా 256GB స్టోరేజ్ కలిగి ఉంది. దీనిని అవసరమైతే 1TB వరకు మెమరీ కార్డు ద్వారా స్టోరేజ్ పెంచుకోవచ్చు.
కెమెరా సెటప్:
ఇక మొబైల్ కెమెరా సెటప్ విషయానికొస్తే.. ఇందులో 50MP మెయిన్ కెమెరా (f/1.88 అపర్చర్ రేటుతో), 2MP పోర్ట్రెట్ కెమెరా, LED ఫ్లాష్‌తో పాటు, 1080p@60fps వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక మొబైల్ ముందుభాగంలో 8MP సెల్ఫీ కెమెరా (f/2.05 అపర్చర్ రేటుతో) వచ్చేసింది.

Read Also:Minister Narayana: భూ కేటాయింపులపై కీలక నిర్ణయాలు.. 12 అంశాలకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం..!
బ్యాటరీ:
OPPO K13x లో 6000mAh భారీ బ్యాటరీని అందించనున్నారు. దీనికి 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కు మద్దతు కల్పించనున్నారు. కేవలం 7.99 మిల్లీమీటర్లు మందంగా ఉన్న ఈ ఫోన్, వెనుక భాగంలో మెట్ ఫినిష్ తో స్మూత్ గ్రిప్‌ను అందిస్తుంది. అలాగే ఈ మొబైల్ లో సైడ్ – మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ 5G VoLTE, Wi-Fi 802.11ac, Bluetooth 5.4, USB Type-C వంటి అన్ని ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.

వీటితోపాటు మిలిటరీ-గ్రేడ్ durability (MIL-STD-810H) సర్టిఫికేషన్ అందించనున్నారు. దీని వల్ల ఈ ఫోన్ దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం IP65 రేటింగ్‌ను సైతం కలిగి ఉంది. ఇది గత మోడల్‌కు ఉన్న IP54 కంటే మెరుగైనదని కంపెనీ పేర్కొంది. అత్యధిక ఉష్ణోగ్రత, తేమ, షాక్ వంటి పరిస్థుతుల్లో సైతం ఫోన్ పనితీరును నిర్ధారించేందుకు అనేక కఠినమైన పరీక్షలు నిర్వహించినట్లు ఓప్పో తెలిపింది.
ధరలు:
ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. అలాగే మిడ్ నైట్ వయొలెట్, సన్ సెట్ పీచ్ కలర్ ఆప్షన్లలో ఈ మొబైల్ లభించనుంది. ఇక ధరల విషయానికి వస్తే.. 4GB + 128GB మోడల్ రూ.11,999, 6GB + 128GB మోడల్ రూ.12,999, 8GB + 256GB మోడల్ రూ.14,999 కు లభించనుంది.

ఈ మొబైల్ జూన్ 27 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్ కార్ట్, ఓప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్ లలో లభ్యం కానుంది. లాంచ్ ఆఫర్లలో భాగంగా రూ.1000 బ్యాంక్ డిస్కౌంట్, అలాగే మూడు నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ లలో లభ్యమవుతున్నాయి. ఆకర్షణీయమైన ధర, మంచి స్పెసిఫికేషన్స్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో OPPO K13x 5G బడ్జెట్ సెగ్మెంట్‌లో మొబైల్ వినియోగదారులను ఆకర్షించడంలో విజయం సాధించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.