జాబ్ సెర్చ్ లో ఉన్నవారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ అందించింది. ఎస్ఎస్ సీ ఫేజ్ 13 (సెలక్షన్ పోస్టుల పరీక్ష 2025) కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 2423 పోస్టులను భర్తీచేయనున్నారు. 10వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు పోటీపడొచ్చు. పోస్టులను అనుసరించి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి 10వ తరగతి/12వ తరగతి/గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండటం తప్పనిసరి. అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు. రిజర్వ్డ్ కేటగిరీ నుంచి వచ్చే అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Also Read:Toxins : బాడీలోని టాక్సిన్స్‌ని బయటకుపంపే 7 అద్భుతమైన కషాయాలు..
ఆగస్టు 1, 2025ని దృష్టిలో ఉంచుకుని వయస్సును లెక్కిస్తారు. జనరల్, OBC మరియు EWS కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 100గా నిర్ణయించారు. SC/ST, PH కేటగిరీ అభ్యర్థులు ఈ నియామకానికి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సీబీటీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జూన్ 23 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.