Buy OnePlus 10 Pro 5G Smartphone Rs 54999 in Amazon Great Freedom Festival Sale 2023: మీరు కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా?. అయితే మీకు పండగ లాంటి వార్త. ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’లో బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్‌లో భాగంగా తక్కువ ధరకే 5జీ ఫోన్ కొనొచ్చు. వన్‌ప్లస్ 10 ప్రో 5జీ ఫోన్‌ను రూ. 17 వేల తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఆ వివరాలు ఓసారి చూద్దాం.
వన్‌ప్లస్ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 66,999గా ఉంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై 18 శాతం తగ్గింపు ఉంది. దాంతో ఈ ఫోన్ రూ. 54,999కు అందుబాటులో ఉంటుంది. అంటే మీరు రూ. 12,000 డిస్కౌంట్ పొందుతారు. అలాగే ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఇక ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే మీకు దాదాపుగా రూ. 5 వేల తగ్గింపు వస్తుంది. అప్పుడు మీరు రూ. 49,999కే ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు.
వన్‌ప్లస్ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 52,100 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. పూర్తి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వర్తిస్తే.. మీరు కేవలం రూ. 2899కే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. మీ పాత ఫోన్ కండిషన్ బాగుంది, లేటెస్ట్ మోడల్ అయుండి, ఎలాంటి డామేజ్ లేకుంటేనే ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వర్తిస్తుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి. అందుకే మీ పాత ఫోన్‌కు ఎంత ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వస్తుందని ముందే చెక్ చేసుకుంటే మేలు. ఇక వన్‌ప్లస్ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌పై ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.