ఒడిశా రాష్ట్రంలో ప్రసిద్ధ పూరి జగన్నాథుని రథయాత్ర ప్రారంభమైంది. ఈ రథయాత్ర ఉత్సవాలు దాదాపు పదిరోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసే రథయాత్రలో శ్రీకృష్ణుడిని జగన్నాథుడిగా ఆరాధిస్తారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శుక్ల పక్షం విధియ తిథి నుంచి ప్రారంభమవుతుంది. ఈ రథయాత్రలో పాల్గొనడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. కాగా ఈ యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. యాత్రలో తొక్కిసలాట జరిగి ఒకరు మరణించడం విచారకరం. దాదాపు…