TTD : శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరో సౌకర్యం అందుబాటులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీటీడీ భక్తుల కోస మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈసారి లగేజ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఆటోమేషన్, డిజిటలైజేషన్‌తో భక్తులకు వేగంగా, సులభంగా సేవలందించనుంది. బాలాజీ బ్యాగేజ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BBMS) మొదట ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టబడి విజయవంతమైంది. చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సివిఎస్‌ఓ) డి నరసింహ కిషోర్‌తో కలిసి బీబీఎంఎస్ గురించి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వివరించారు. ప్రస్తుతం ఉన్న మాన్యువల్ బ్యాగేజీ నిర్వహణ స్థానంలో సులభంగా, వేగంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం మొబైల్ ఫోన్లు, లగేజీ డిపాజిట్, సేకరణ కోసం బీబీఎంఎస్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
Also Read : Vijay Devarakonda : అనిరుధ్ ని కిడ్నాప్ చేసి అయినా నా సినిమాకు తీసుకోవాలని ఉంది.
Also Read
దర్శనానికి వెళ్లే సమయంలో కొంత మంది భక్తులు తమ జేబులో దాచుకున్న మొబైల్ ఫోన్‌లను జమ ప్రక్రియలో జాప్యం జరుగుతుందని, తర్వాత గుర్తించామని, ఈ అసౌకర్యానికి గుర్తించామని ఈవో తెలిపారు. కానీ ఇప్పుడు కొత్త వ్యవస్థ భక్తులను సంతృప్తిపరిచేలా మరింత చక్కగా, పారదర్శకతతో సమస్యను పరిష్కరించిందని ఆయన పేర్కొన్నారు. కొత్త విధానంలో దర్శనం టిక్కెట్లు స్కాన్ చేయబడతాయని, వారి లగేజీ, మొబైల్ ఫోన్‌ల వివరాలతో పాటు ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయన్నారు. దర్శనం టిక్కెట్లు లేని వారి వస్తువులు స్కాన్ చేయబడి QR కోడ్ రసీదుతో RFID కోడ్ ఉత్పత్తి చేయబడుతుందని ఈవో తెలిపారు. అదేవిధంగా మొబైల్ డిపాజిట్ కోసం శ్రీవారి దర్శనం టిక్కెట్లతో పాటు భక్తుల ఆధార్ వివరాలను సేకరించి క్యూఆర్ కోడ్, రశీదు ఇస్తారని తెలిపారు.
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!