US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. ఊహించని పరిణామాల మధ్య యూఎస్ సెనేట్ను డెమోక్రాట్లు దక్కించుకుని తమ ఆధిక్యాన్ని చాటుకున్నారు. దశాబ్దాలుగా రిపబ్లికన్ల కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాల్లో డెమోక్రాట్లు ఘన విజయం సాధించి వర్జీనియా నుంచి టెక్సాస్ వరకు వీచిన “బ్లూ వేవ్”తో తమ పాగా వేశారు. ముఖ్యంగా టెక్సాస్, కాన్సాస్, ఓహియో వంటి కీలక రాష్ట్రాల్లో డెమోక్రాట్లు తమ హవా చాటారు. టెక్సాస్ సెనేట్ స్థానంలో దశాబ్దాల తర్వాత డెమోక్రాటిక్ అభ్యర్థి ఘన విజయం సాధించగా, కాన్సాస్‌లో ఏకంగా దాదాపు 94 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సెనేట్ సీటును డెమోక్రాట్లు కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు.
ఇక రిపబ్లికన్లకు తిరుగులేని కోటగా పరిగణించే సౌత్ కరోలినాలో కూడా సెనేట్ స్థానాన్ని డెమోక్రాట్లు దక్కించుకోవడం విశేషం. ఈ సంచలన విజయాలతో సెనేట్‌లో మ్యాజిక్ ఫిగర్‌ను సునాయాసంగా దాటేసిన డెమోక్రాట్లు, ట్రంప్ ప్రస్తుత పదవీకాలం ముగిసే వరకు సెనేట్, కాంగ్రెస్ రెండింటిపై పూర్తి నియంత్రణను సాధించారు. ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలు అమెరికా రాజకీయంలో ట్రంప్ ఆధిపత్యానికి పెద్ద చెక్ పెట్టడమే కాకుండా, రాబోయే రోజుల్లో ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలపై డెమోక్రాట్ల ప్రభావం బలంగా ఉండబోతోందని స్పష్టం చేస్తున్నాయి.
Also Read
- Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే 'వావ్' అనాల్సిందే.!
- US Midterm Elections: కాన్సాస్ యూఎస్ సెనేట్ ఎన్నికల్లో సంచలనం.. 94 ఏళ్ల తర్వాత డెమోక్రటిక్ అభ్యర్థి విజయం..
- AP Municipal Results 2026: కూటమి పార్టీల మధ్య ఘర్షణ.. టీడీపీ వర్గాలపై జనసేన శ్రేణుల దాడి!
- Donald Trump: "నేను బరిలో ఉంటే వేరేలా ఉండేది".. ఎన్నికల్లో తన పార్టీ వెనకబాటుపై ట్రంప్ తొలి ప్రకటన..
ఇక, ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తాజాగా ట్రంప్ స్పందించారు. ఈ ఫలితాలపై అసహనం వ్యక్తం చేశారు. బ్యాలెట్ పేపర్లో తన పేరు ఉంటే.. ఓడిపోయేవాళ్లం కాదని తన సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. తాను పోటీలో ఉండి ఉంటే.. రిపబ్లికన్ పార్టీ అఖండ విజయం సాధించలేదంటూ ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు వచ్చిన ఫలితాలను సైతం తాను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. డెమోక్రాట్లతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం..
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!
-
US Midterm Elections: కాన్సాస్ యూఎస్ సెనేట్ ఎన్నికల్లో సంచలనం.. 94 ఏళ్ల తర్వాత డెమోక్రటిక్ అభ్యర్థి విజయం..
-
REDMAGIC 12 Pro: 8400mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ ఫోన్.. REDMAGIC 12 Pro లాంచ్.. 185Hz OLED డిస్ప్లే, 50MP కెమెరా
-
AP Municipal Results 2026: కూటమి పార్టీల మధ్య ఘర్షణ.. టీడీపీ వర్గాలపై జనసేన శ్రేణుల దాడి!
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!