Omicron BF7: చైనాలో మరోసారి కరోనా కేసులు బీభత్సంగా పెరుగుతున్నాయి. రోజూ వేలాదిమంది ఆస్పత్రుల పాలవుతున్నారు. వందలాది మంది చికిత్స తీసుకుంటూ చనిపోతున్నారు. రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి మరింత ఉంటుందని వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న మూడు నెలల్లో మరిన్ని వెరియంట్లు దేశాన్ని తాకే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో చైనా ప్రభుత్వం తన జీరో కోవిడ్ విధానాన్ని అకస్మాత్తుగా వెనక్కి తీసుకుంది. దీంతో ఒక్కసారిగా కేసులు బయటపడ్డాయి. మృతుల సంఖ్యను చైనా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడంలేదు.
Also Read : Dhamaka Movie Controversy : ముగిసిన ధమాకా వివాదం.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) సైతం చైనాలో కోవిడ్ కేసులపై ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం బీజింగ్ శ్మశానవాటిక వెలుపల డజన్ల కొద్దీ వాహనాలు మృతదేహలతో క్యూలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. పెరుగుతున్న వ్యాప్తిలో చైనా మరణాలను నివేదించనప్పటికీ.. పరిస్థితి మాత్రం తీవ్ర ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో చైనాలో పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితి యొక్క తీవ్రత గురించి వివరణాత్మక సమాచారాన్ని అందించాలని ఆయన చైనాను కోరారు. దేశవ్యాప్తంగా అత్యధిక ప్రమాదంలో ఉన్న వ్యక్తులకు టీకాలు వేయడంపై చైనా తన ప్రయత్నాలను కేంద్రీకరించాలని ఆయన కోరారు.
"In order to make a comprehensive risk assessment of the situation on the ground, WHO needs more detailed information on disease severity, hospital admissions and requirements for intensive care units support"-@DrTedros https://t.co/2usxAOXCjj
— World Health Organization (WHO) (@WHO) December 21, 2022