Dhamaka Movie Controversy : మాస్ మాహారాజా రవితేజ, శ్రీలీల నటిస్తోన్న సినిమా ధమాకా. ఈ మూవీ ఆడియో ఫంక్షన్లో తమను అవమానించారంటూ ఉప్పర కులస్తులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ.. తెలంగాణ రాష్ట్ర నగర ఉప్పర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో ఉప్పర కులస్తులు బుధవారం ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆందోళన చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఛాంబర్ వద్ద బైఠాయించారు. ‘ధమాకా’ చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన, నటుడు, నిర్మాత బండ్ల గణేష్ లు వెంటనే క్షమాపణలు చెప్పాలని సగర ఉప్పర సంఘం డిమాండ్ చేసింది.
Also Read : Varisu Movie Update: వారసుడు ఆడియో లాంచ్.. గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తున్న మేకర్స్
ఈ క్రమంలో చిత్ర దర్శకుడు త్రినాథ రావు దిగివచ్చారు. ఉప్పర సోదరులకు దర్శకుడు త్రినాథరావు క్షమాపణ చెప్పారు. తనపై ఉన్న కోపాన్ని సినిమాపై చూపించొద్దని వేడుకున్నారు. తానూ బీసీనేనని ఉప్పరులు కూడా బీసీల్లో భాగమేనన్నారు. అక్కడితో ఆగకుండా ఉప్పర పదాన్ని బహిష్కరించాలని సూచించారు. ఇకపై రాజకీయనాయకులు, సినీ నటులు, ఇతరులు ఎవరూ ఉప్పర పదం వాడొద్దన్నారు.
మాస్ మాహారాజా రవితేజ, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన ధమాకా సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్, సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ధమాకా ఆడియో ఫంక్షన్ నిర్వహించింది చిత్రయూనిట్. అయితే ఈ ఈవెంట్ లే డైరెక్టర్ త్రినాథరావు మాట్లాడుతూ.. “ఏంటీ నీ ఉప్పర సోది “అంటూ కామెంట్ చేశారు. దీంతో దర్శకుడి తీరుపై ఉప్పర కులస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా కామెంట్లు చేస్తున్నారంటూ హైదరాబాద్ ఫిలిం చాంబర్ వద్ద ఆందోళన, దిష్టి బొమ్మలను దహనం చేశారు. ‘ధమాకా’ చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన, నటుడు, నిర్మాత బండ్ల గణేష్ లు వెంటనే క్షమాపణలు చెప్పాలని సగర ఉప్పర సంఘం డిమాండ్ చేసింది. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సినిమాలను ఆపేస్తామని హెచ్చరించారు.