తెలుగు స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం 120 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్నారని తెలుస్తుంది.తాజాగా ప్రభాస్ ఇక పై సంవత్సరాని కి రెండు లేదా మూడు సినిమాలలో నటిస్తానని అదే సమయంలో ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటానని కూడా ఫ్యాన్స్ హామీ ఇచ్చాడు.
ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ప్రభాస్ నటించిన నాలుగు సినిమాలు థియేటర్ల లో విడుదల కానున్నాయి. ప్రభాస్ త్వరలో మరో రెండు కొత్త సినిమాలను ప్రకటించనున్నారని తెలుస్తుంది.ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో స్పిరిట్ సినిమా తెరకెక్కుతుండ గా ఈ సినిమా 2025లో విడుదల కానుందని సమాచారం.. టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో మరే హీరో ఇంత వేగంగా సినిమాలు అయితే చేయడం లేదు. పారితోషకం ద్వారా ప్రభాస్ సంవత్సరాని కి సులువు గా 300 కో ట్ల రూపాయల స్థాయిలో ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారని తెలుస్తుంది.. ప్రభాస్ ఎక్కువ సంఖ్యలో సినిమాల లో నటించడం వల్ల ఇండస్ట్రీకి కూడా చాలా మేలు జరుగుతోంది. ప్రభాస్ నటించిన సినిమాలు నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను అందిస్తుండటం విశేషం.ప్రభాస్ సినిమాలకు బడ్జెట్ తో పోల్చి చూస్తే రెట్టింపు స్థాయిలో బిజినెస్ అయితే జరుగుతోంది. నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారానే ప్రభాస్ సినిమాల హక్కుల బడ్జెట్ రికవరీ అవుతుండటం విశేషం.. ప్రభాస్ సంవత్సరానికి 300 కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లు సంపాదించినా ప్రభాస్ టాలీవుడ్ లో బిలీనియర్ హీరో అవుతారని చెప్పవచ్చు. స్పీడ్ విషయంలో ప్రభాస్ కు పోటీనిచ్చే మరో స్టార్ హీరో కూడా లేరనే విషయం తెలిసిందే. సినిమా సినిమాకు ప్రభాస్ మార్కెట్ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఆనందిస్తున్నారు.. ఈ ఏడాది ఆదిపురుష్, సలార్ సినిమాలతో ప్రభాస్ ప్రేక్షకులను పలుకరించనున్నారు.ప్రాజెక్ట్ కె సినిమాను వచ్చే సంవత్సరం విడుదల చేస్తున్నట్లు సమాచారం.