Pension Amount : 2024 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇండియా కూటమి భారీ విజయని అనుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలలో ముందు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక పెన్షన్ రూ. 4000 ఇస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే జూలై మొదటికి గాను 4వేల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిసింది. అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బకాయిలు ఒక్కొక్కరికి రూ. 1000 చొప్పున జూలై 1న 7వేల రూపాయలు అందించేలా ప్రస్తుత ప్రభుత్వం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Chain Snatching : మంగళగిరి శివారు ప్రాంతాల్లో రెచ్చిపోతున్న చైన్స్ స్నాచర్లు..
ఈ నేపథ్యంలో భాగంగా జూన్ 1 న పెన్షన్ పంపిణీ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సెర్ప్ అధికారులతో సమీక్షను చేపట్టారు. వచ్చే నెలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి కొండపల్లి ఆదేశాలు జారీ చేశారు. ఇక నెలకు పెన్షన్ రూ. 4000 చేయడంతో ఆంధ్రప్రదేశ్ లోని చాలామంది లబ్ధి పొందనున్నారు.
Fraud Case : లైన్ మెన్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 9 లక్షలు వాసులు చేసిన కార్పొరేటర్..