Chain Snatching : గుంటూరు జిల్లాలోని మంగళగిరి శివారు ప్రాంతాలలో గత కొన్ని రోజుల నుంచి చైన్స్ స్నాచర్లు చేతివాటం చూపిస్తున్నారు. దీంతో జిల్లాలోని మహిళలు ఒంటరిగా రోడ్డుపై నడవాలంటే భయపడిపోతున్నారు. ముఖ్యంగా చైన్ స్నాచర్స్ తెల్లవారుజామున ఒంటరిగా వెళ్తున్న మహిళ లను టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు.
Israel Hamas War : ఇజ్రాయెల్‌లో తుపాకీలకు పెరిగిన డిమాండ్… 42వేల మంది మహిళలు దరఖాస్తు
ముఖ్యంగా కూలీ పనులకు వెళ్లే వాళ్లను, అలాగే ఇంటి ముందర ముగ్గులు వేసే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు చైన్ స్నాచింగ్ గ్యాంగ్. దొంగతనాలకు పాల్పడే వ్యక్తులు స్పీడ్ బైక్ లు ఉపయోగిస్తూ వాటికి నెంబర్ ప్లేట్ లేకుండా జాగ్రత్తగా పడుతున్నారు. పరిస్థితి ఇలా ఉండగా మంగళగిరి శివారు ప్రాంతాలలో అనేక ఇళ్లలో దొంగతనాలు జరుగుతున్నాయని.. అలాగే సాయంత్రం పూట వీధి దీపాలు కూడా వెలగడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా ప్రజలు పోలీసుల గస్తీ మరింత పెంచాలని వారు కోరుతున్నారు.