Site icon NTV Telugu

PM Modi: రక్తంతో ఆడుకున్నారు.. బెంగాల్‌ ఎన్నికల హింసపై ప్రధాని మోడీ ధ్వజం

Pm Modi

Pm Modi

PM Modi: మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పై ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ఆ పార్టీ రక్తంతో ఆడుకుందని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని క్షేత్రీయ పంచాయితీ రాజ్ పరిషత్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ, “టీఎంసీ నే ఖూనీ ఖేల్ ఖేలా హై…” అని పీఎం మోడీ హిందీలో అన్నారు. అంతేకాకుండా, ఆ పార్టీ ఓటర్లను బెదిరిస్తోందని, వారి జీవితాలను నరకం చేస్తోందని కూడా ప్రధాని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి తమను తాము చాంపియన్లుగా అభివర్ణించుకునే వారే ఈవీఎంలను తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని ప్రధాని మోదీ అన్నారు.

Read Also: Indian Railway Cheap Medicine: ప్రయాణంలో ఆరోగ్యం క్షీణించిందా.. ఈ 50 రైల్వే స్టేషన్లలో చౌకగా మందులు

“బీజేపీ అభ్యర్థి ఎవరూ నామినేషన్‌ వేయకుండా ఉండేందుకు వారు ఏమైనా చేస్తారు. బీజేపీ కార్యకర్తలను మాత్రమే కాకుండా ఓటర్లను కూడా బెదిరిస్తున్నారు. బూత్‌లను స్వాధీనం చేసుకునేందుకు కాంట్రాక్టులు ఇచ్చారు.. ఇది రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్న వారి తీరు.” అని ప్రధాన మంత్రి మోడీ మండిపడ్డారు. పార్టీ పనిని పూర్తి చేయడానికి ప్రాణాంతక దాడులను తన సాధనంగా ఉపయోగిస్తోందని తృణమూల్ కాంగ్రెస్‌పై ప్రధాని విరుచుకుపడ్డారు.

Read Also: Binoy Viswam: పార్లమెంట్‌లో బీజేపీ డాన్‌లాగా ప్రవర్తిస్తోంది..

పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు జూలై 8న జరగగా, 63,229 గ్రామ పంచాయతీ స్థానాలకు జూలై 11న ఓట్ల లెక్కింపు జరిగింది. పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) భారీ విజయం సాధించింది. మొత్తం 63,219 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరగగా, 35 వేలకు పైగా స్థానాల్లో తృణమూల్‌ గెలిచింది. బీజేపీ దాదాపు 10 వేల స్థానాల్లో గెలుపొందగా, లెఫ్ట్‌- కాంగ్రెస్‌ కూటమి 6 వేల చోట్ల విజయం సాధించింది. 928 జిల్లా పరిషత్‌ సీట్లలో టీఎంసీ 880 సీట్లు కైవసం చేసుకోగా, బీజేపీ 31 సీట్లు, లెఫ్ట్‌- కాంగ్రెస్‌ కూటమి 15 సీట్లు గెలుచుకున్నాయి. మిగిలిన 2 సీట్లను ఇతరులు గెలుచుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో పంచాయితీ ఎన్నికలకు ముందు నెలలో ఎన్నికల సంబంధిత హింసలో మొత్తం 40 మంది మరణించారని నివేదికలు తెలిపాయి.

Exit mobile version