మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పై ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ఆ పార్టీ రక్తంతో ఆడుకుందని అన్నారు.
పశ్చిమ బెంగాల్ లో జూలై 8న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. టీఎంసీ, బీజేపీలు ఇరు పక్షాలు దాడులు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణల్లో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు మరణిస్తున్నారు.