Nara Lokesh: ‘ఓజీ’ సినిమా ప్రదర్శనకు సంబంధించిన ఏపీ జీవోలో మార్పు చోటుచేసుకుంది. ప్రీమియర్ షో సమయాన్ని మార్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 25న అర్ధరాత్రి ఒంటి గంట షో స్థానంలో.. ఈ నెల 24న రాత్రి 10 గంటలకు ప్రీమియర్ ప్రదర్శనకు అవకాశం కల్పించింది. అంటే మరికొన్ని గంటల్లో సినిమా తెరపైకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి ట్వీట్ చేశారు. OGకి క్రేజీ మీనింగ్ చెప్పిన లోకేష్.. ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు. “OG అంటే Original Gangster. మా పవన్ అన్న అభిమానులకు మాత్రం Original God. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న OG సినిమా విడుదల సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు. సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.” అని నారా లోకేష్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మరోవైపు ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఆసక్తిక ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే టికెట్లు దొరకడం కష్టంగా మారింది.
READ MORE: Varundha Shopping Mall : కొత్తపేటలో వరుంధ షాపింగ్ మాల్ రెండవ బ్రాంచ్ ఘన ప్రారంభం
#OG అంటే Original Gangster. మా పవన్ అన్న అభిమానులకు మాత్రం Original God. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న #OG సినిమా విడుదల సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు. సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #TheycalllHimOG @PawanKalyan pic.twitter.com/LFfUbabPvY
— Lokesh Nara (@naralokesh) September 24, 2025