NTV Telugu Site icon

Himayatsagar Reservior: పెరిగిన వరద ఉధృతి.. ఆరు గేట్లు ఎత్తివేత

Himayath Sagar

Himayath Sagar

తెలంగాణ‌ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా మోస్తారు నుంచి భ‌రీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. హిమాయత్ సాగర్ ప్రాజెక్టులోని ఆరు గేట్లను అధికారులు ఎత్తేశారు. అయితే, ఇప్పటికే వ‌ర‌ద నీరు భారీగా వ‌స్తుండ‌టంతో శుక్రవారం ఈ ప్రాజెక్ట్ లోని రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడిచిపెట్టారు. మూసీ నది పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో వర్షాలు కొనసాగుతుండటంతో హిమాయత్ సాగర్ ఆరు గేట్లను ఎత్తి అదనపు నీటిని విడుదల చేసిన‌ట్టు సంబంధిత అధికార వ‌ర్గాలు వెల్లడించాయి. గేట్లు ఎత్తి 4120 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు.

Read Also: Extramarital Affair: భర్త ఇంట్లో ఉండగానే.. ప్రియుడ్ని ఇంటికి పిలిపించి..

ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో.. హిమాయత్ సాగర్ జలాశయంకు భారీగా నీరు చేరుతుంది. వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో మరో రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు అధికారులు రిలీజ్ చేశారు. అయినా.. హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్ కు ఇన్ ఫ్లో తగ్గకపోవడంతో మరో ఆరు గేట్ల ద్వారా నీటిని దిగువకు జల మండలి అధికారులు విడుదల చేశారు. హిమాయత్ నగర్ నుంచి రాజేంద్రనగర్ వైపు వెళ్లే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును అధికారులు మూసి వేశారు. ఇరువైపుల బారీ‌ కేడ్స్ ను రాజేంద్రనగర్ పోలీసులు ఏర్పాటు చేశారు. దీంతో కింద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు మీదకు భారీగా నీటి ప్రవాహం వచ్చింది. సర్వీస్ రోడ్డు మీద ఫుల్ ఫోర్స్ తో నీరు వెళ్తుంది. సర్వీస్ రోడ్డు మీద రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేసి.. వాహనాలు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read Also: Snakes: అల్లుళ్లకు కట్నంగా స్నేక్ రాజాలు.. అదే వారి ఆచారం..!

చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ ప‌ల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో ఈ నెల 24 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప‌లు చోట్ల భారీ వర్షాలు సైతం కురుస్తాయ‌ని ఐఎండీ హెచ్చరించింది. హిమాయత్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన తర్వాత మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇదిలా ఉండగా, రాగల 24 గంటల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ డిపార్ట్మెంట్ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణతో పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించారు. అయితే, హైదరాబాద్ కు ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణశాఖ డైరెక్టర్ నాగరత్నం తెలిపారు.