Office Romances: ఈమధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అక్రమ సంబంధాలు, ప్రేమాయనాలు సంబంధించిన అనేక విషయాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆఫీస్ ప్రేమాయణాలు సంబంధించిన ఓ సువే బయటకు వచ్చింది. ఈ లిస్ట్ లో కూడా భారత్ దూసుక పోతుందంటే నమ్మండి.. అవునండి బాబు.. డిస్క్రీట్ రిలేషన్షిప్ల కోసం ప్రసిద్ధమైన Ashley Madison అనే ప్లాట్‌ఫామ్, YouGov సంస్థతో కలిసి 11 దేశాల్లో ఈ సర్వేను నిర్వహించింది. ఈ అధ్యయనంలో భాగంగా ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, జర్మనీ, భారత్, ఇటలీ, మెక్సికో, స్పెయిన్, స్విట్జర్లాండ్, యుకె, యుఎస్ దేశాల నుండి మొత్తం 13,581 మంది సర్వేలో పాల్గొన్నారు. ఇందులో మెక్సికో మొదటి స్థానంలో నిలవగా.. భారత్ రెండవ స్థానాన్ని సంపాదించింది.
Al Falah University: అల్-ఫలాహ్ యూనివర్సిటీకి ఎదురుదెబ్బ.. న్యాక్ షోకాజ్ నోటీసులు
ఈ కొత్త సర్వే ప్రకారం.. భారతీయులలో పదిమందిలో నలుగురు (40%) తమ సహోద్యోగులతో ప్రేమ సంబంధం కలిగి ఉన్నారని, మరికొందరైతే ప్రస్తుతం అలాంటి సంబంధంలో ఉన్నారని అంగీకరించారు. మెక్సికోలో ఈ సంఖ్య 43% కాగా.. యుఎస్, యుకె, కెనడా వంటి దేశాల్లో ఇది 30% మాత్రమే. ఈ అధ్యయనంలో పురుషులు మహిళల కంటే ఎక్కువగా ఆఫీస్ ప్రేమాయణాలకు పాల్పడుతున్నారని వెల్లడైంది. పురుషులలో 51% మంది సహోద్యోగులతో డేటింగ్ చేసినట్లు చెబుతుండగా, మహిళలలో ఇది 36% మాత్రంగానే ఉంది. దీనితోపాటు మహిళలు వృత్తి పరమైన విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారని సర్వే చెబుతోంది. ఇందులో 29% మహిళలు తమ కెరీర్‌పై ప్రభావం పడొచ్చనే భయంతో కార్యాలయ ప్రేమలను నివారిస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో 27% పురుషులు కూడా ఇలాంటి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పురుషులు వ్యక్తిగత పరిణామాలపైన ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని సర్వే తెలిపింది.
అలాగే 18 నుంచి 24 ఏళ్ల వయసు గల యువ ఉద్యోగులు కార్యాలయ ప్రేమల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారని అధ్యయనం వెల్లడించింది. వీరిలో 34% మంది అలాంటి సంబంధాలు తమ కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. అలాగే Gleeden అనే మరో డేటింగ్ యాప్ నిర్వహించిన సర్వే ప్రకారం.. భారతీయులలో 35% మంది ప్రస్తుతం ఓపెన్ రిలేషన్షిప్లో ఉన్నారని, 41% మంది తమ భాగస్వామి సూచిస్తే అలాంటి సంబంధాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ ధోరణి కేవలం మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం కాలేదు. చిన్న పట్టణాలు కూడా ఈ మార్పులో భాగమవుతున్నాయి. ఇందులో తమిళనాడులోని కాంచీపురం పట్టణం భారతదేశంలో ఇలాంటి వివాహేతర రిలేషన్లపై ఆసక్తి ఎక్కువగా చూపుతున్న ప్రాంతంగా నిలిచింది.