Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Zaheeraba Bjp

Off The Record : విజయం కోసం కామారెడ్డి జాయింట్ కిల్లర్ మ్యాజికేంటి..?

Published Date :April 10, 2024 , 10:06 pm
By Gogikar Sai Krishna
Off The Record : విజయం కోసం కామారెడ్డి జాయింట్ కిల్లర్ మ్యాజికేంటి..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

అసెంబ్లీ ఎన్నికల్లోకి ఫ్రషర్‌గా ఎంటరై మహామహుల్ని మట్టికరిపించిన చరిత్ర ఆ ఎమ్మెల్యేది. కానీ… ఇప్పుడాయనకు అంతకు మించిన అగ్ని పరీక్ష ఎదురవబోతోంది. అప్పుడు కాదు… ఇప్పుడు చూపించు నీ సత్తా అంటూ సవాల్‌ విసురుతున్నారు రాజకీయ ప్రత్యర్థులు. నీ జెయింట్‌ కిల్లర్‌ మేజిక్‌ ఏంటో చూస్తామంటూ తొడగొడుతున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ విషయంలో ఆయనకు సవాళ్ళు ఎదురవుతున్నాయి? ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా మారిందట కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేసిన సీఎం, మాజీ సీఎంని ఓడించి జైంట్‌ కిల్లర్‌ ఇమేజ్‌ సంపాదించిన రమణారెడ్డికి అదే ఇమేజ్‌తో జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించింది బీజేపీ. అసెంబ్లీ ఎలక్షన్స్‌ తర్వాత జాతీయ నాయకుల దగ్గర వచ్చిన ప్రత్యేత గుర్తింపుతోనే ఆయనకు ఈ పెద్ద బాధ్యత ఇచ్చారని అంటున్నాయి పార్టీ వర్గాలు. జహీరాబాద్‌లో ఇప్పటిదాకా బీజేపీ గెలిచిన చరిత్ర లేదు. నియోజకవర్గం పరిధిలో పార్టీకి ఓట్‌ బ్యాంక్‌ అంతంత మాత్రంగానే ఉందట. ఈ పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థిని గట్టెక్కించాలని ఉవ్విళ్ళూరుతున్నారాయన. మోడీ చరిష్మా, అయోధ్యలో రామ మందిర నిర్మాణం కలిసి వస్తాయని, ఓట్‌ బ్యాంక్‌ పెరుగుతుందని ధీమాగా ఉన్నారట కాషాయ నేతలు.

జహీరాబాద్ బీజేపీ టికెట్టును 35 మందిదాకా అభ్యర్ధులు ఆశించారట. వాళ్లందర్నీ కాదని, బీఆర్ఎస్ నుంచి వలసొచ్చిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్‌కి టికెట్‌ ఇచ్చింది బీజేపీ. దీంతో ఆశావహులంతా గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. అందుకే వారు పార్టీ అభ్యర్ధితో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారట. ఈ పరిస్థితుల్లో నేతల మధ్య విభేదాలు, ఆధిపత్యపోరు ఇబ్బందికరంగా మారుతోందని అంటున్నారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో గత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్ధి బానాల లక్ష్మారెడ్డి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధులందరికీ కలిపినా…లక్షా 72వేల 766 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ… పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలంటే కనీసం ఇంకో మూడున్నర లక్షలకు పైగా ఓట్లు సాధించాల్సిన అవసరం ఉంది. ఇంతటి ప్రతికూల పరిస్దితుల్లో పార్టీ పెద్దలు నమ్ముకున్న జైంట్‌ కిల్లర్‌ రమణారెడ్డి విజయం కోసం ఎలాంటి మ్యాజిక్‌ చేస్తారన్నది ఆసక్తిగా మారింది నియోజకవర్గంలో. అన్నిటికీ మించి నాయకులను సమన్వయం చేస్తూ… ముందుకు సాగడం ఎమ్మెల్యేకు సిసలైన సవాల్‌ అంటున్నారు. దీంతో పరిస్థితిని గమనించిన పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్.. పూర్తిగా కాషాయ దళంపైఆధారపడకుండా.. తన సొంత టీంని కూడా రంగంలోకి దింపినట్టు తెలిసింది. అయితే ప్రచార పర్వంలో వాళ్ళ హవా పెరిగి పోవడం పార్టీ సీనియర్స్‌కు నచ్చడం లేదంటున్నారు. ఇన్ని రకాల సమస్యలు, సవాళ్ళ మధ్య బీజేపీ విజయావకాశాలు ఎంతవరకు మెరుగుపడుతున్నాయి? బీబీ పాటిల్‌ హ్యాట్రిక్‌ కొడతారా? వంటి చర్చోపచర్చలు జరుగుతున్నాయి జహీరాబాద్‌లో.

Also Read

  • Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..
  • Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
  • Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
  • Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ntv
  • off the record

తాజావార్తలు

  • Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..

  • Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు

  • Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..

  • Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!

  • Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!

ట్రెండింగ్‌

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions