Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Telangana Bjp Office Bearers Meeting

Off The Record: పార్టీ నాయకత్వం అంటే గౌరవం లేదా..?

Published Date :August 7, 2024 , 9:00 pm
By Mahesh Jakki
  • నామ మాత్రంగా పార్టీ కార్యక్రమాలు
  • క్షేత్ర స్థాయిలో ఉలుకు పలుకు లేదన్న టాక్‌
  • పార్టీ మీటింగ్స్‌పై నేతల పెదవి విరుపులు
  • తాజాగా స్టేట్‌ ఆఫీస్‌ బేరర్స్‌ మీటింగ్‌
  • మీటింగ్‌ని లైట్‌ తీసుకున్న పార్టీ ఎమ్మెల్యేలు
Off The Record: పార్టీ నాయకత్వం అంటే గౌరవం లేదా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: పార్టీ మీటింగ్‌లంటే తెలంగాణ కమలం నేతలకు మొహం మొత్తిందా? వాటితో అయ్యేది లేదు.. పొయ్యేది లేదంటూ లైట్‌ తీసుకుంటున్నారా? స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు నిర్వహించిన సమావేశానికి ఏకంగా ఏడుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడాన్ని ఎలా చూడాలి? రాష్ట్ర బీజేపీలో ఏం జరుగుతోంది?

తెలంగాణ కమలం పార్టీలో ఇంకా స్తబ్దత పోలేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఫర్వాలేదనిపించినా… ఆ పార్టీ కేడర్ ఇంకా యాక్టివ్ మోడ్ లోకి రాలేదు. ఏదో …నామ్ కే వాస్తేగా పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయట.అగ్ర నాయకత్వం ఎంత ఫాలో ఆప్ చేసినా… వెంటపడుతున్నా… క్షేత్ర స్థాయిలో మాత్రం పెద్దగా ఉలుకూపలుకు ఉండడం లేదంటున్నారు. ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే… ఆ…. చేద్దాంలే అంటున్నారట. అదే పార్టీ మీటింగ్‌ అంటే…ఇంకా వెనకడుగు వేస్తున్నట్టు తెలిసింది. ఆ మీటింగ్‌లతో అయ్యేది లేదు పొయ్యేది లేదంటూ పెదవి విరుస్తున్నట్టు తెలిసింది. తాజాగా మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్‌ జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా హర్ ఘర్ తిరంగా పై చర్చ జరిగింది.. ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం రెండు మూడు రోజుల ముందుగానే సంబంధిత వ్యక్తులకు వెళ్ళింది. ఇందులో ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ప్రకటించింది కూడా… అయితే చివరికి నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా మినహా ఎవరు హాజరు కాలేదు..మిగతా అంతా… మీటింగ్ ను లైట్‌గా తీసుకున్నారన్న సమాచారం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది.

Also Read

  • Heinrich Klaasen: ప్రతి రూపాయికి విలువ.. ఆరెంజ్ ఆర్మీకి అసలైన హీరో.. హెన్రిచ్ క్లాసెన్ సూపర్ ఫామ్.!
  • Fennel Sharbat Recipe: వేసవికి చల్లని ప్రత్యేక పానీయం.. షుగర్‌, మసాలా లేకుండా చిటికెలో తయారయ్యే సోంపు షర్బత్..!
  • Best Bedsheets for Summer: వేసవి ఉక్కపోతతో నిద్రపట్టడం లేదా..? ఈ బెడ్‌షీట్‌ మార్చి చూడండి.. హాయిగా నిద్ర పడుతుంది...!
  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

వ్యయ ప్రయాసలకు ఓర్చి మీటింగ్‌కు వెళ్ళినా… అక్కడ ఒరిగేదేం లేదు, అయ్యేది, పొయ్యేది లేని కార్యక్రమం కోసం అనవసరంగా ఆయాస పడటం దేనికన్న అభిప్రాయం పార్టీ ఎమ్మెల్యేలకే ఉందట.పెద్దగా నిర్ణయాలు తీసుకునేది ఉండదని, సరైన గౌరవం కూడా దక్కనప్పుడు వెళ్ళడం ఎందుకుకునే వాళ్ళు డుమ్మా కొట్టారన్న చర్చ జరుగుతోందట తెలంగాణ బీజేపీ వర్గాల్లో. అయినాసరే…రాష్ట్రంలో పార్టీకి ఉన్నదే 8మంది ఎమ్మెల్యేలు. అందులో ఏడుగురు మీటింగ్‌ రాకపోవడమంటే మరీ అంత నిర్లక్ష్యమా అన్న టాక్‌ నడుస్తోంది. అదే సమయంలో… పార్టీ అధినాయకత్వానికి, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్‌ ఉందా అన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. పార్టీ నాయకత్వం అంటే ఎమ్మెల్యేలకు కనీస గౌరవం లేదా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. అయితే నిన్న మొన్నటిదాకా అసెంబ్లీ సమావేశాల కోసం హైదరాబాద్ లోనే ఉన్నామని, ఇప్పుడే నియోజకవర్గాలకు వస్తే… వెంటనే మీటింగ్ పేరుతో రమ్మంటే ఎలాగన్నది ఎమ్మెల్యేల ప్రశ్న అంటున్నారు కొందరు. మరోవైపు పార్టీ ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే… ఖర్చుల సంగతేంటని అడుగుతున్నారట జిల్లా అధ్యక్షులు. పార్టీ అధినాయకత్వం డబ్బులు పంపిస్తేనే ప్రోగ్రాం, లేకుంటే లేదని కరాఖండీగా చెప్పేస్తున్నట్టు తెలిసింది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి జండాలు పంపిస్తేనే చేస్తామని, మా జేబులు ఖాళీ చేసుకోలేమని చెప్పినట్టు ప్రచారం ఉంది. మొత్తంగా తెలంగాణ బీజేపీలో ఏదేదో జరిగిపోతోందని, ఇంతకు ముందు ఇలాంటి వాతావరణం లేదని వాపోతున్నారట పాత తరం నేతలు. పార్టీ పెద్దలు దీన్ని ఎలా సెట్‌ చేస్తారో చూడాలి మరి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BJP office bearers Meeting
  • off the record
  • OTR Story
  • telangana
  • Telangana BJP

తాజావార్తలు

  • Heinrich Klaasen: ప్రతి రూపాయికి విలువ.. ఆరెంజ్ ఆర్మీకి అసలైన హీరో.. హెన్రిచ్ క్లాసెన్ సూపర్ ఫామ్.!

  • Highest Run Chases: ఐపీఎల్ చరిత్రలోనే టాప్‌లో పంజాబ్, హైదరాబాద్.. ఈ టీమ్‌లకే ఎలా సాధ్యం?

  • Rupee vs Dollar: మళ్లీ పతనమైన రూపాయి విలువ.. అమెరికన్‌ డాలర్‌తో 95.23కి.. కారణాలు ఏమిటి?

  • Fennel Sharbat Recipe: వేసవికి చల్లని ప్రత్యేక పానీయం.. షుగర్‌, మసాలా లేకుండా చిటికెలో తయారయ్యే సోంపు షర్బత్..!

  • May 1st Releases : టాలీవుడ్ స్ట్రైట్ మూవీస్ Vs డబ్బింగ్ మూవీస్

ట్రెండింగ్‌

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions