Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Tdp 12

Off The Record : ఫ్రస్ట్రేషన్‌లో ఉమ్మడి పశ్చిమ గోదావరి టీడీపీ నేతలు..కారణం ఏంటంటే..!!

Published Date :April 4, 2025 , 7:59 pm
By Gogikar Sai Krishna
Off The Record : ఫ్రస్ట్రేషన్‌లో ఉమ్మడి పశ్చిమ గోదావరి టీడీపీ నేతలు..కారణం ఏంటంటే..!!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మా త్యాగాలకు మీరిచ్చే విలువ ఇదేనా? సర్దుబాటు పేరుతో మేం ఎప్పటికీ త్యాగరాజులుగానే మిగిలిపోవాల్నా? నిన్నగాక మొన్న వచ్చినవాళ్ళు పెత్తనాలు చేస్తుంటే…. ఐదేళ్ళు నానా తంటాలు పడి కేడర్‌ని నిలుపుకున్న మేం మాత్రం సినిమా చూసినట్టు చూస్తూ… చప్పట్లు కొట్టాల్నా? ఏంటీ మాకీ ఖర్మ అంటున్నారట కీలకమైన ఆ జిల్లాలోని టీడీపీ లీడర్స్‌. ఎక్కడుందా పరిస్థితి? ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్‌ పెరుగుతోంది? 2024 అసెంబ్లీ ఎన్నికల పొత్తులో భాగంగా… ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి గెలిచింది జనసేన. ఇప్పుడు ఆయా నియోజకవర్గాల టీడీపీ నాయకుల్లో ఫ్రస్ట్రేషన్‌ పెరుగుతోందట. కష్టకాలంలో వెన్నంటి ఉండి కేడర్‌ని నిలబెట్టుకుంటే…. తీరా ఎన్నికల టైంలో పొత్తు పేరుతో త్యాగాలు చేయాల్సి వచ్చిందని, ఇప్పుడు పార్టీ పవర్‌లో ఉన్నా… తమ చేతులు కట్టేసినట్టుగా ఉందని వాపోతున్నారట. ఓవైపు జనసేన ఎమ్మెల్యేలు హడావిడి చేస్తుంటే… తాము మాత్రం చేష్టలుడిగి చూస్తూ కూర్చోవాల్సి వస్తోందని అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. తిరిగి తాము కూడా జనంలో తిరగాలన్నా…. పార్టీ కేడర్‌ని నిలబెట్టుకోవాలన్నా…ప్రాధాన్యత ఉండే నామినేటెడ్‌ పోస్ట్‌లు కావాలని, ఆ పని మాత్రం జరగడం లేదని ఫ్రస్ట్రేట్‌ అవుతున్నట్టు సమాచారం. సీటు త్యాగాలు చేసే సమయంలో నామినేటెడ్ పోస్టులు ఇచ్చి తీరతామని పార్టీ పెద్దలంతా… తెగ భరోసాలు ఇచ్చేశారని, తొమ్మిది నెలలు గడిచినా ఆ ఊసే లేకపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లు. మేమిలా త్యాగరాజులుగా మిగిలిపోవాల్సిందేనా అన్నది వాళ్ళ క్వశ్చన్‌. ఉగాది నాటికి అందరికీ న్యాయం చేస్తామని పార్టీ అధినేత హామీ ఇవ్వడంతో నాయకులంతా ఆసక్తిగా ఎదురు చూశారట. ఉగాది పోయింది… శ్రీరామ నవమి వస్తోంది. అయినా ఆ వాసన కూడా రాక ఉసూరుమంటున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, ఉంగుటూరు, నిడదవోలు, నరసాపురం,భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో జనసేన జెండా ఎగిరింది. ఈ ఆరు చోట్ల త్యాగాలు చేసిన టిడిపి ఇంఛార్జిల్లో ఒక్క పోలవరం నియోజకవర్గ ఇంఛార్జికి మాత్రమే ఏపీ ట్రైకార్ చైర్మన్ పోస్ట్‌ దక్కింది. మిగిలిన ఐదు చోట్ల నేతలు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తూనే ఉన్నారు. మొదట ఉంగుటూరు నుంచి పోటీ చేయాలనుకున్న టీడీపీ ఫైనల్‌గా ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించి… అక్కడి అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజును గెలిపించే బాధ్యతను మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకు అప్పగించింది.

ప్రతిగా ఆయనకు భవిష్యత్తులో ఎమ్మెల్సీ, లేదా అత్యంత గౌరవమైన పదవి కట్టబెట్టడమే కాకుండా… అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని చెప్పారట టీడీపీ పెద్దలు. దాంతో అప్పటి నుంచి అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు గన్ని. ఒకప్పుడు మంత్రిగా ఓ వెలుగు వెలిగి పార్టీనే నమ్ముకున్న మాజీ మంత్రి జవహర్‌కు సముచిత స్థానం కల్పించడమే కాకుండా నామినేటెడ్‌ పోస్టుల్లో అవకాశం ఇస్తారని మొదటి నుంచి భావిస్తున్నారు. తాడేపల్లిగూడెం కన్వీనర్‌ వలవల బాబ్జీ, నరసాపురం నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడంతో అక్కడ టీడీపీ నుంచి పోటీ చేయాలని ఆశించిన పార్టీ కన్వీనర్‌ రామరాజు, మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడుకి,నిడదవోలు నుంచి రెండు సార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు సైతంఅధికారం లోకి వచ్చిన వెంటనే మంచి పదవులు ఇస్తామని భరోసా ఇచ్చిందట టీడీపీ అధిష్టానం. కానీ… వీళ్ళలో ఎవరికీ ఇప్పటిదాకా ఏ పదవీ రాలేదు. దాంతో… పొత్తు ధర్మానికి కట్టుబడి పోటీ నుంచి వైదొలిగినందుకు మాకిచ్చే గౌరవం ఇదేనా అంటూ తీవ్ర అసహనం పెరుగుతోందట సదరు లీడర్స్‌లో. అదే సమయంలో…. తర్వాతి జాబితాలోనైనా న్యాయం చేస్తారా? లేక ఈసారికింతే… అలా సర్దుకుపోండని చావు కబురు చల్లగా చెబుతురా అన్న టెన్షన్‌ పెరుగుతున్నట్టు చెబుతున్నారు నేతల సన్నిహితులు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 20 మందిదాకా సీనియర్లు వివిధ కార్పొరేషన్స్‌లో పదవులు ఆశిస్తున్నారు. ఎవరికి వారే నెక్స్ట్‌ లిస్ట్‌ అంటూ ఆశగా ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు….నిత్యం యుద్ధం చేశామని, అక్రమ కేసులకు భయపడకుండా పనిచేసినా….చివరికి దక్కే గౌరవం ఇదేనా అంటూ కొందరు నాయకులు లోలోపల కుమిలిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. త్యాగరాజులకు అవకాశాలు వస్తాయా? లేక పార్టీ పెద్దలు సారీతో సరిపెడతారా అన్నది తేలాలంటే… ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ntv
  • off the record
  • tdp

తాజావార్తలు

  • Polavaram-Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. జనాలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ!

  • Venugopal Rao: ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంచేసింది వాళ్లే.. డైరెక్టర్ వేణుగోపాల్ రావు కుండబద్దలు!

  • Dhurandhar: హిస్టరీలో ఫస్ట్ టైమ్.. థియేటర్లలో ‘ధురంధర్’ మేకింగ్?

  • Mega 158: మెగాస్టార్‌కు విలన్‌గా డింపుల్ హయాతి?

  • Tollywood Young Directors : ఇలా చెక్కితే ఎలాగయ్యా?

ట్రెండింగ్‌

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • 144Hz రిఫ్రెష్ రేట్‌, 13.2 అంగుళాల డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!

  • 50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!

  • Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!

  • 90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions