Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Kethireddy Venkatrami Reddy 2

Off The Record: కలర్ఫుల్ కేతిరెడ్డి డీ గ్లామర్ అయ్యారా..?

Published Date :July 29, 2024 , 9:45 pm
By Mahesh Jakki
  • సహజమైన పొలిటికల్‌ మూసకు భిన్నంగా కేతిరెడ్డి
  • రెండు సార్లు గెలుపు..రెండు సార్లు ఓటమి
  • ఈసారి ఓటమి కేతిరెడ్డిని కుంగదీసిందా?
  • కలర్‌ఫుల్‌ కేతిరెడ్డి డీ గ్లామర్‌ అయ్యారా?
Off The Record: కలర్ఫుల్ కేతిరెడ్డి డీ గ్లామర్ అయ్యారా..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Off The Record: ఆ మాజీ ఎమ్మెల్యే వేషం మారింది.. భాష మారింది… మొత్తంగా ఆయన తీరే మారిపోయింది. అయ్యో… అధికారం పోతే… ఇంతలా మారిపోతారా అంటూ బుగ్గలు నొక్కుకుంటున్నారట చూస్తున్న వాళ్ళు. గతంలో చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడే ఆ మాజీ స్వరంలో కూడా కాస్త తేడా వచ్చిందట. ఇంతకీ ఎవరాయన? ఎందుకు ఆ రేంజ్‌లో మార్పు?

రాజకీయ నాయకులన్నాక ఖద్దర్‌ వేయడం, కాస్ట్లీ కార్లలో తిరుగుతూ… దర్పం ఒలకబోయాలనుకోవడం కామన్‌. కానీ… ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాత్రం ఆ మూసలోకి వెళ్లకుండా తనకో స్టైల్‌ ఏర్పరచుకునే ప్రయత్నం చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రెండుసార్లు ఓటమి చూశారాయన. ఎప్పుడో తప్ప ఖద్దర్‌ జోలికిపోని మాజీ ఎమ్మెల్యే….ఎప్పుడూ కలర్ ఫుల్ డ్రస్సులతో కనిపిస్తుంటారు. అప్పుడప్పుడు గుర్రపు స్వారీలు, బైక్ రైడింగ్స్‌తో సగటు ఎమ్మెల్యేకి భిన్నంగా ఉంటుంది ఆయన వ్యవహారశైలి. ఇక కేతిరెడ్డి ఏదైనా మాట్లాడారంటే… పక్కా ఎవిడెన్స్ ఉంటుందన్నది రాజకీయ వర్గాల్లో ఉండే అభిప్రాయం. ఇలా ఒక భిన్నమైన దారిలో వెళ్తున్న కేతిరెడ్డిని ఈసారి ఓటమి మాత్రం చాలా కృంగదీసిందట. గతంలో ఓడిపోయినప్పుడు పెద్దగా బాధపడలేదుగానీ… ఈసారి మాత్రం నిత్యం జనంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే.. ఇలాంటి తీర్పు ఇచ్చారా అంటూ తెగ ఫీలై పోతున్నారట సన్నిహితుల దగ్గర. అందుకు తగ్గట్టుగానే.. ఆయన వేషంలో కూడా ఇంకా బాగా మార్పు వచ్చిందంటున్నారు. ఎప్పుడూ కలర్ ఫుల్ గా కనిపించే కేతిరెడ్డి… ఇప్పుడు గడ్డం పెంచుకొని చాలా డీ గ్లామర్ గా కనిపిస్తున్నారన్నది ఆయన సన్నిహితుల్లో టాక్‌. ఇక గతంలో ఏ విషయమైనా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడే కేతిరెడ్డి… ఇప్పుడు ఒకరకమైన స్వరంతో మాట్లాడుతున్నారట.

Also Read

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్
  • Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
  • Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
Add as a preferred
source on google

అధికారంలో ఉన్నప్పుడు ఆయన భూ ఆక్రమణలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు వాటి మీద విచారణ జరిపించాలన్న డిమాండ్స్‌ పెరుగుతున్నాయి. ముఖ్యంగా బత్తలపల్లి సమీపంలో నిడిమామిడి భూముల విషయంపై కేతిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అధికార పక్షం నేతలు. వాస్తవంగా ఈ భూములు కేతిరెడ్డి పేరు మీద లేవు. అయితే ఆంజనేయస్వామి మఠానికి సంబంధించిన భూములను వైసీపీ నేతలు కాజేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దాని వెనక కేతిరెడ్డి ఉన్నారని ప్రత్యక్షంగా చాలామంది ఆరోపిస్తున్నారు. అలాగే ఐదేళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని, వాటన్నిటి మీద విచారణ జరిపించాలన్నది ఆయన ప్రత్యర్థుల డిమాండ్‌. అయితే.. మిగతా ఆరోపణల సంగతి ఎలా ఉన్నా… నిడిమామిడి మఠం భూముల విషయంలో మాత్రం ఆయన కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు చెబుతున్నారు. ఆ భూములకు తనకు ఎలాంటి సంబంధం లేదని, సమగ్ర విచారణ చేపట్టాలంటూ రివర్స్ అటాక్ మొదలు పెట్టినట్టు తెలిసింది. అంతేకాకుండా ఇప్పుడున్న పాలకపక్షం మాటలకే పరిమితమైతే… తిరిగి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్థలంలో పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని అంటున్నారట కేతిరెడ్డి. మొత్తంగా మారిపోయిన కేతిరెడ్డి తీరుపై గట్టి చర్చే జరుగుతోంది నియోజకవర్గంలో.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • kethireddy venkatrami reddy
  • off the record
  • OTR Story
  • telugu news

తాజావార్తలు

  • GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్‌కు..!

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!

  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్

  • Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions