Off The Record: టికెట్ హామీ దగ్గరే చేరిక ఆగిందా..? లేదంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆ మాజీ ఎమ్మెల్యే రెండు ప్రధాన పార్టీలతో దోబూచులాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే… కండిషన్స్‌తో టెన్షన్ పెడుతున్నారు. ఉన్న పార్టీ మీద అలిగారు…. రమ్మన్న పార్టీకి కండిషన్స్ అప్లై అంటున్నారు. ఆ ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ ఎలా పడుతుందా అని రెండు పార్టీల కేడర్ ఆసక్తిగా చూస్తోంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయనకే ఎందుకంత డిమాండ్?
చిలుముల మదన్‌రెడ్డి. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడని చెబుతారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి రెండు సార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యారాయన. 2018 ఎన్నికల తర్వాత మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న మదన్‌రెడ్డికి భంగపాటు తప్పలేదు. నర్సపూర్ టికెట్ ను అప్పట్లో బీఆర్ఎస్ చాలా రోజులు పెండింగ్‌లో పెట్టడంతో మార్పు అనివార్యమని, సునీతా లక్ష్మారెడ్డే ఈ సారి బీఆర్ఎస్ అభ్యర్థి అని అందరు ఫిక్స్ అయ్యారు. దీంతో అప్పుడే కాంగ్రెస్‌లోకి వెళ్ళాలనుకున్నారు మదన్‌రెడ్డి. రకరకాల వత్తిళ్లతో ఆగిపోయారు. చివరికి ఆయన్ని ఒప్పించి సునీతా లక్ష్మారెడ్డికే టికెట్ కేటాయించింది పార్టీ. ఎంపీ టికెట్ ఇస్తామన్నది నాటి ఒప్పందం. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా నర్సాపూర్‌లో పార్టీని గెలవడానికి కీలకంగా పనిచేశారు మాజీ ఎమ్మెల్యే. దీంతో ఇక ఎంపీ టికెట్ ఆయనదేనిన అనుకుంటున్న టైంలో… కొందరి పేర్లు తెర మీదికి వచ్చాయి.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
ఫైనల్‌గా ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటి నుంచి మదన్‌రెడ్డి పార్టీపై గుర్రుగా ఉన్నారు. తాను ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఎంపీ ఇస్తామని చెప్పి చివరికి అది కూడా ఇవ్వకుండా పార్టీ తనని రోడ్డున పడేసిందని అనుచరులతో గోడు వెళ్ళబోసుకుంటున్నారట. ఈ పరిస్థితుల్లో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లితో భేటీ అయి కాంగ్రెస్‌లో చేరికకి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పెద్దలు ఆయనకి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదట. జిల్లా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావు కౌడిపల్లిలోని మదన్‌రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించే యత్నం చేసినా వర్కౌట్ కాలేదని తెలిసింది. హరీష్‌రావుని కలిసిన తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయారట మదన్‌రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో కూడా మెదక్ ఎంపీ సీటు ఇస్తేనే…వస్తానని చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ఆ మేటర్ దగ్గరే చేరిక ఆగిందని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ మెదక్ ఎంపీ సీటు బీసీలకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. నీలం మధుకు టికెట్ ఖరారు అయినట్టు లీకులు వస్తున్నాయి. అయితే మదన్‌రెడ్డితో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు ఎంపీ టికెట్ హమీ ఇస్తే పార్టీలో చేరుతామని చెబుతున్నట్టు తెలిసింది. దీంతో టిక్కెట్ ఇస్తేనే ఆయన పార్టీలో చేరతారా? లేక కాంగ్రెస్ పెద్దలు కన్విన్స్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి మదన్‌రెడ్డి మాత్రం ఇటు బీఆర్ఎస్ పెద్దల మాట వినకుండా..అటు కాంగ్రెస్ పార్టీకి ఎంపీ టికెట్ కండిషన్ పెట్టి రెండు పార్టీలను టెన్షన్ పెడుతున్నారట. మరి ఈ కథ కంచికి చేరుతుందా లేదా అన్నది చూడాలి.
తాజావార్తలు
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!