Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జింబాబ్వేతో జరగబోయే మూడు టీ20ల సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ సద్గోపన్ రమేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే భారత టీ20 జట్టును ఎంపిక చేస్తున్నారని, అయితే ఈ నిబంధన కొందరికే పరిమితం కావడం విచారకరమని ఆయన విమర్శించారు. వరుసగా 2025, 2026 సీజన్లలో ఐపీఎల్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు నుంచి ఒక్క ఆటగాడిని కూడా సెలెక్ట్ చేయకపోవడాన్ని రమేష్ ప్రశ్నించారు.
ఐపీఎల్ 2026లో 28 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచిన అర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను పక్కన పెట్టడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భువనేశ్వర్ వంటి సీనియర్ బౌలర్లను వదిలేసి, ఐపీఎల్ వికెట్ల జాబితాలో 47, 55, 89వ స్థానాల్లో ఉన్న హర్ష్ దూబే, అశోక్ శర్మ, యష్ ఠాకూర్ వంటి వారిని, అలాగే సరిగా మ్యాచ్‌లు ఆడని మయాంక్ యాదవ్‌ను ఎంపిక చేయడంపై మండిపడ్డారు.
Also Read
- Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
- Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
- UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
అలాగే, ఐపీఎల్లో కనీసం ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయని సూర్యాంష్ షెడ్గేను ఆల్‌రౌండర్‌గా ఎలా ఎంపిక చేస్తారని రమేష్ నిలదీశారు. ఐపీఎల్ రెండో అర్ధభాగంలో తమ ఫ్రాంచైజీ తుది జట్టులోనే చోటు దక్కించుకోలేకపోయిన రవి బిష్ణోయ్‌ను టీమిండియా జట్టులోకి తీసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు.
శ్రేయస్ అయ్యర్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే చోటు దక్కినప్పుడు, ఇతర అర్హులైన ఆటగాళ్ల పట్ల సెలెక్టర్లు ద్వంద్వ ప్రమాణాలు పాటించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేసిన పాపం ఏంటి..? ఇలా అయితే.. ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సెలెక్టర్లు ఆర్సీబీపై చిన్న చూపు చూడటం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
-
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
-
Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!