Off The Record: అసెంబ్లీ బరిలో వైసీపీ ఎంపీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం…. ఒంగోలుకు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ దీని పార్లమెంట్ పరిధి మాత్రం బాపట్లలో ఉంటుంది. ఒంగోలుకు దగ్గర కావడంతో జిల్లా పరిధి ప్రకాశంలోనే ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్ బాబు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ తరపున గెలిచారు. మొదట్లో బాగానే ఉన్నా… ఆ తర్వాత అధికారుల బదిలీలు, తనకు నచ్చిన వారికి పనుల కేటాయింపు లాంటి కారణాలతో ద్వితీయ శ్రేణి నేతలతో ఎమ్మెల్యేకు గ్యాప్ పెరిగిందట. చీమకుర్తి మినహా మిగిలిన అన్ని మండలాల్లోని ద్వితీయ శ్రేణి నేతలతో ఆయనకు చెడిందట. నాగులుప్పలపాడు, మద్దిపాడు, సంతనూతలపాడు మండలాల్లో ఎమ్మెల్యే తీరు నచ్చక కులాల వారీగా గ్రూపులు కట్టారట వైసీపీ నేతలు. దీంతో ఈసారి ఆయనకు సీటు ఇచ్చినా…గెలుపు డౌటేనన్న టాక్ మొదలైందట నియోజకవర్గంలో. అవినీతి ఎమ్మెల్యే మాకొద్దు.. కొత్త సమన్వయకర్త ముద్దంటూ సుధాకర్‌బాబుకు వ్యతిరేకంగా నాలుగు మండలాల్లోని వైసీపీ కార్యకర్తలు అధిష్టానానికి లేఖలు రాయడం, నియోజకవర్గంలో పోస్టర్లు వేయటం కలకలం రేపింది. దీంతో పాటు స్థానిక ఎస్సీ నేతలు ఇటీవల బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ని కలవటం చర్చనీయాంశంలా మారిందట.. నాలుగు మండలాలకు చెందిన దాదాపు వంద మందికి పైగా నేతలు ఎంపీని కలిసి సంతనూతలపాడు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తే తమ ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పారట.
బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చేయటానికి ఆసక్తిగా ఉన్నారని ప్రచారంలో ఉండటం, అందుకు తగ్గట్టుగానే.. ఆయన సామాజిక వర్గానికే చెందిన వైసీపీ నాయకులు భేటీ కావటంతో ఇక ప్రచారం జోరందుకుంటోందట. ఎస్సీలతో పాటు ఇతర సామాజిక వర్గ నేతలు కూడా సుధాకర్‌బాబుకు బదులుగా నందిగం సురేష్ వస్తే… తమకేం ఇబ్బంది లేదని అంటున్నారట.
పైగా.. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులంతా ఆయన తప్ప ఇంకెవరైనా తమకు అభ్యంతరం లేదని చెబుతున్నారట. ఎంపీ సురేష్ అయితే నియోజకవర్గ ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి పని తేలిక అవుతుందని చెబుతోందట ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం. మరోవైపు ఎమ్మెల్యే సుధాకర్ బాబు కూడా ఏ చిన్న అవకాశం దొరికినా తన సీటును నిలబెట్టుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట.. తానే పోటీలో ఉంటానని, కంగారు పడాల్సిన పని లేదని తన అనుచరులకు చెప్పుకుంటున్నారట.
Also Read
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
ఎంపీ సురేష్ ఈసారి అసెంబ్లీ బరిలోనే నిలుస్తారని ఆయన వర్గీయులు చెబుతుండటంతో సంతనూతలపాడు నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువన్నది లోకల్ టాక్. ఎంపీ మనసులో ఏముందనేది ఇంత వరకూ స్పష్టత లేకున్నా…జరుగుతున్న ప్రచారం మాత్రం ఎమ్మెల్యే సుధాకర్ బాబును కలవరపెడుతోందట. ప్రాంతీయ, సామాజిక సమీకరణాల ఆధారంగా సీట్లు ఖరారు చేసే వైసీపీ అధినాయకత్వం సంతనూతలపాడు విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!