Off The Record: ఖైరతాబాద్ ఉపఎన్నికపై బీఆర్ఎస్ నజర్.. గులాబీ అభ్యర్థి ఆయనేనా?
- దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్ట్ అనర్హత వేటు..
- సుప్రీం కోర్ట్కెళ్ళిన దానం, తీర్పుపై ఉత్కంఠ..
- ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే అంటూ పార్టీలు సమాయత్తం..
- బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలోకి తలసాని సాయికిరణ్ పేరు..
- ప్రస్తుతం సికింద్రాబాద్ లోక్‌సభ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా సాయికిరణ్..
- గ్రేటర్ బీఆర్ఎస్ వ్యవహారాల్లో కీలకంగా తలసాని శ్రీనివాస్ యాదవ్..
- పార్టీ అధిష్టానం ఆర్ధిక, రాజకీయ బలం ఉన్న అభ్యర్థి కోసం చూస్తోందా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణలో మరో ఉప ఎన్నిక ప్రస్తావన తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించింది హై కోర్ట్. దాని మీద ఆయన సుప్రీం కోర్ట్ తలుపు తట్టారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందన్న సంగతి అలా ఉంచితే… ప్రధాన పార్టీలు మాత్రం ఖైరతాబాద్ బైపోల్ మీద దృష్టి పెడుతున్నాయి. ఒకవేళ ఉప ఎన్నిక అనివార్యమైతే… అప్పటికప్పుడు పరుగులు పెట్టకుండా ముందు నుంచే జాగ్రత్తలు పడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్… 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచారు. కానీ… రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కారు దిగేసి… కాంగ్రెస్‌లో చేరారాయన. అక్కడితో ఆగితే అది వేరేలా ఉండేదిగానీ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ సీట్లో కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్‌పై పోటీ చేశారాయన. సరిగ్గా ఈ పాయింటే తిరుగులేని సాక్ష్యంగా మారింది. హైకోర్ట్ కూడా ఆ పాయింట్ ఆధారంగానే వేటేసింది. ఒక పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి, రాజీనామా చేయకుండా మరో పార్టీ బీ ఫామ్ మీద ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ప్రశ్నించింది. ఈ పరిస్థితుల్లో… సుప్రీం కోర్ట్ తీర్పు ఎలా ఉన్నా… ఖైరతాబాద్ ఉప ఎన్నిక చుట్టూనే చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఒకవేళ బైపోల్ జరిగితే… కాంగ్రెస్ తరపున తిరిగి దానం నాగేందరే బరిలో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరుంటారన్న ప్రశ్న ఉదయిస్తోంది. అందుకు సమాధానంగానా అన్నట్టు తాజాగా తెరపైకి వచ్చింది మాజీ మంత్రి తలసాని శ్రీనిస్ యాదవ్ కొడుకు సాయికిరణ్ యాదవ్ పేరు. ప్రస్తుతం ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు సాయి కిరణ్. పార్టీ వ్యవహారాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2024 ఎంపీ ఎలక్షన్స్‌కు దూరంగా ఉన్నారాయన. అదే సమయంలో బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ వ్యవహారాల్లో… తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎల్పీ ఉప నాయకుడిగా కూడా ఉన్న తలసాని…. ఖైరతాబాద్ ఉప ఎన్నిక అంటూ జరిగితే… తెర మీదికి మరొకరి పేరు రాకుండా తన కొడుకు కోసం గట్టిగా పావులు కదుపుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అటు పార్టీ అధిష్టానం కూడా… పార్టీలో యాక్టివ్‌గా ఉంటూ అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వగలిగిన అభ్యర్థి కోసం చూస్తున్నట్టు చెబుతున్నారు.
Also Read
కుటుంబ రాజకీయ నేపధ్యం, తండ్రి పలుకుబడి, పార్టీలో ఆయన పోషిస్తున్న పాత్ర….. ఇలా అన్నిటినీ చూసుకుని సాయి కిరణ్‌వైపు మొగ్గవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి లేకపోవడం వల్లే ఆ రెండు ఎలక్షన్స్‌లో ఓడామన్న భావన బీఆర్ఎస్ పెద్దల్లో ఉందట.
అందుకే ఖైరతాబాద్‌లో ఆర్థికంగా, రాజకీయంగా… తలసాని సాయికిరణ్ బలమైన అభ్యర్థి అవుతాడని తెలంగాణ భవన్ వర్గాలు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే… ఈ లెక్కలన్నీ…. ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక వస్తేనే. ఈ పరిస్థితుల్లో… అటు సుప్రీం కోర్ట్ తీర్పు ఎలా ఉంటుందన్న ఉత్కంఠ కూడా అన్ని పార్టీల్లో పెరుగుతోంది. సుప్రీం కూడా హైకోర్ట్ తీర్పును సమర్ధిస్తే… ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. మరోవైపు గులాబీ ఆశావహులు మరికొందరు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ… తెలంగాణ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారట.
తాజావార్తలు
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!