Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Kcr Sensational Comments Over Kavitha Arrest Issue

Off The Record: కేసీఆర్‌లో అగ్నిపర్వతం బద్దలవుతుందా..?

Published Date :July 24, 2024 , 10:00 pm
By Sudhakar Ravula
  • దెబ్బ మీద దెబ్బలతో కేసీఆర్‌ ఉక్కిరి బిక్కిరి..
  • అగ్నిపర్వతం రగులుతోందని తాజా వ్యాఖ్యలు..
  • ఒకేసారి ఆకాశం నుంచి పాతాళానికి..
  • అసహనంలో నుంచే అగ్నిపర్వతం వ్యాఖ్యలు?..
  • నాలుగు నెలల నుంచి కూతుర్ని విడిపించుకోలేని స్థితి..
  • అధికారానికి దూరం అవుతానని ఊహించని కేసీఆర్‌..
Off The Record: కేసీఆర్‌లో అగ్నిపర్వతం బద్దలవుతుందా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: దెబ్బలు… ఒకదాని వెంట ఒకటిగా వరుస దెబ్బలు… అది కూడా అలా ఇలా కాదు… విధి పగబట్టినట్టుగా, వాచిపోయేట్టు.. లాగిపెట్టి కొడుతున్న దెబ్బలు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ విషయంలో ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. అటు రాజకీయంగా, ఇటు వ్యక్తిగతంగా తగులుతున్న స్ట్రోక్స్‌తో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారట ఆయన. లోలోపల ఫ్రస్ట్రేషన్‌ ఎంత పీక్స్‌కు చేరుకోకపోతే… నాలో అగ్నిపర్వతం రగులుతోందని ఆయన అంటారన్న చర్చ జరుగుతోంది. తాజాగా తమ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆ కామెంట్‌ చేశారు కేసీఆర్‌. 14 ఏళ్ళ తెలంగాణ ఉద్యమంలో, పదేళ్ళ అధికారంలో.. తిరుగులేని ఆధిపత్యం చెలాయించారాయన. పవర్‌లో ఉన్న పదేళ్ళ కాలం సరే.. అంతకు ముందు ఉద్యమ సమయంలో కూడా ఒకరకంగా అనధికారికంగా కేసీఆర్‌ మాటే చెల్లుబాటైందన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం.

అంటే.. దాదాపు 24 ఏళ్ళపాటు ఆయన హవానే నడిచింది. కానీ, ఇప్పుడాయన పరిస్థి ఆకాశంలో కట్లు తెగి అమాంతం పాతాళంలోకి పడిపోయినట్టుగా ఉందంటున్నారు. తాను ఉన్నన్నాళ్ళు శాశ్వతమనుకున్న అధికారం చేజారిపోయింది. ఓడిపోగానే.. తుంటి ఎముక విరిగి ఆసుపత్రి పాలయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో బిడ్డ కవిత అరెస్టయి నాలుగు నెలలవుతోంది. అప్పటి నుంచి తీహార్‌ జైల్లోనే ఉన్నారామె. ఇక పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి లోక్‌సభలో ప్రాతినిధ్యం పోయింది. ఫస్ట్‌టైం ఒక్క ఎంపీ సీటు కూడా గెలవక చతికిల పడింది బీఆర్‌ఎస్‌. దాన్ని చాలా పరువు తక్కువ వ్యవహారంగా ఫీలవుతున్నారట కేసీఆర్‌. ఇక అది చాలదన్నట్టు.. ఎద్దు పుండును కాకి పొడిచినట్టు ఇప్పుడు ఎమ్మెల్యేల వలసల పర్వం. ఒకప్పుడు కనుసైగలతో శాసించి పక్క పార్టీల ఎమ్మెల్యేల్ని లాగేసుకోవడమే కాదు.. ఏకంగా ఆయా పార్టీల శాసనసభా పక్షాల్నే విలీనం చేసేసుకున్న కేసీఆర్‌ ఇప్పుడు సొంత గుర్తు మీద గెలిచిన వాళ్ళని కాపాడుకోలేని దీన స్థితికి పడిపోయారు. తన సహజ శైలికి భిన్నంగా ఆయన దిగొచ్చి ఎమ్మెల్యేల్సి బాబ్బాబు అని బతిమాలుకున్నా… ఎవ్వరూ ఆగడం లేదట. ఇలా ఎటు చూసినా… సమస్యలు, సమస్యలు… ఒకటే సమస్యలు. తిండి పోదు, నిద్ర రాదు, కుదురుగా కూర్చోలేని, నిల్చోలేని పరిస్థితి.. .అందుకే ఫ్రస్ట్రేషషన్‌… ఫ్రస్ట్రేషన్‌… ఒకటే ఫ్రస్టేషన్‌ అంటున్నాయి రాజకీయ వర్గాలు.

Also Read

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..
  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
  • IPL 2026: 8 మ్యాచ్‌లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..

ఆ అసహంలో నుంచే అగ్నిపర్వతం మాటలు వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. పార్టీని జాతీయ స్థాయికి విస్తరించేస్తా… ఛాన్స్‌ వస్తే ప్రధానమంత్రి అయిపోతా… దేశాన్నేలేస్తానంటూ ఒకప్పుడు డాంబికాలు పోయిన నాయకుడు ఇప్పుడు కనీసం కన్న కూతురు నాలుగు నెలల నుంచి జైల్లో ఉన్నా… బయటికి తీసుకురాలేని స్థితిలో ఉండటమన్నది నిజంగా ఆయనకు శిక్షేనన్న మాటలు బలంగానే వినిపిస్తున్నాయి. కనీసం జైలుకు వెళ్ళి కూతుర్ని పరామర్శించలేని స్థితిలో ఏ తండ్రికీ రాకూడనిది ఇది అంటున్నారు పరిశీలకులు. అందుకే నాలో అగ్నిపర్వతం పెరుగుతోందని ఆయన అని ఉండవచ్చంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టిన కొత్తల్లో కూడా అనే ఆటుపోట్లు ఎదుర్కొన్న కేసీఆర్‌… ఇప్పుడు అంతకు మించిన ఇబ్బందుల్లో కూరుకుపోయారని, మరి లోపల పెరుగుతున్న అగ్నిపర్వతాన్ని అణిచేస్తారా? లేక అది ఉన్నట్టుండి ఏదో ఒక రూపంలో బయటికి వస్తుందా? వస్తే.. ఆ లావా ఎవర్ని ముంచెత్తుతుందన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. కేసీఆర్‌ యాక్టివ్‌గా ఉన్నన్ని రోజులు తెలంగాణలో అధికారానికి దూరం అవుతామని ఆయనతో పాటు వంది మాగదులు ఎవరూ ఊహించలేదు.

మూడోసారి కూడా అధికారంలోకి వస్తామనే అతి విశ్వాసంతోనే ఫలితాలు వెలువడే చివరి క్షణం వరకు ఉన్నారు. కానీ చివరికి అంతా తిరగబడేసరికి నిటారుగా నిలబడే కేసీఆర్‌ ఒక్కసారి కుప్పకూలిపోయారు. తాను తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దితే ప్రజలు ఇలా తీర్పు ఇచ్చారేంటంటూ నివ్వెరపోయారు. ఫలితమే ఆయన ఫామ్‌ హౌజ్‌లో పడిపోయి కాలుకు గాయమైంది. ఓడిపోగానే… ఆయనకా దెబ్బ తగలడంతో పార్టీ శ్రేణుల్లో అభద్రత వాతావరణం నెలకొంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏవీ ఆయన ఊహించినవి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ ఎల్పీ మీటింగ్‌లో కేసీర్‌ ఆవేదన చూసిన నేతలు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత నిబ్బరంగా ఉన్నారంటూ గుసగుసలాడుకున్నారట. అధికారం కోల్పోయినా, బిడ్డ జైలులో ఉన్నా, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా, లోక్‌సభ ఎన్నికల్లో సున్నా రిజల్ట్‌ వచ్చినా…లోపల రగులుతున్న అగ్నిపర్వతాన్ని మాత్రం బద్దలవకుండా చూసుకుంటున్నారన్నది బీఆర్‌ఎస్‌ నేతల వెర్షన్. మరి ఆఅగ్నిపర్వతం బద్దలవుతుందా? బద్దలయితే అందులో దహించకపోయే వాళ్లు ఎవరు? గరళ కంఠుడుగా మారానని పరోక్షంగా చెప్పుకుంటున్న కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ను ఎటువైపు తీసుకెళుతాడో చూడాలంటున్నారు పరిశీలకులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BRS
  • Kavitha Arrest
  • kcr
  • off the record

తాజావార్తలు

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

  • Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions