Off The Record: తెలంగాణలో పార్టీ మారి… మెడమీద అనర్హత కత్తి వేలాడుతున్న ఎమ్మెల్యేల్లో చాలామంది వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టెక్నికల్ మాట్లాడుతున్నారు. పార్టీ మారలేదని కొందరు, అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని మరికొందరు చెప్పుకుంటున్నారు. మరోవైపు అనర్హత పిటిషన్ విషయంలో… చర్చ సీరియస్‌గానే నడుస్తోంది. స్పీకర్‌కి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కూడా దగ్గర పడుతుండటంతో… ఇక నాన్చకుండా… ఏదో ఒక చర్య తీసుకునే అవకాశం ఉందనే టాక్ గట్టిగానే ఉంది పొలిటికల్ సర్కిల్స్‌లో. ఐతే… పార్టీ మారారన్నది నైతికంగానే తప్ప… సాంకేతికంగా అనర్హత వేటుకు కావాల్సిన ఆధారాలు లేవని భావిస్తున్న ఎమ్మెల్యేలు.. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే తాము సీఎంని కలిసినట్టు చెప్తున్నారు. బీఆర్‌ఎస్ నుంచి ఫిరాయించిన పది మందిలో 8 మంది ఇదే తరహా సమాధానం ఇవ్వాలని డిసైడైనట్టు సమాచారం. కాబట్టి వాళ్ళు సేఫ్‌జోన్‌లో ఉండవచ్చని భావిస్తున్నారు. ఇక మిగిలిన ఇద్దరు కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also: Asia Cup 2025: ఒకే ఒక్క వికెట్.. చరిత్ర సృష్టించనున్న అర్ష్‌దీప్ సింగ్! తొలి భారత బౌలర్‌గా
గత లోక్‌సభ ఎన్నికల్లో శ్రీహరి కూతురు కడియం కావ్య వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అప్పుడు ఆ ఎన్నికల ప్రచారంలో శ్రీహరి పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉండి, కాంగ్రెస్ అభ్యర్థి కోసం అంతా తానై నడిపించారు కాబట్టి… పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆయన మీద చర్యలు ఉండవచ్చంటున్నారు. ప్రచారం చేసిన అంశమే ముఖ్యమైన ఆధారంగా తెర మీదకు రావచ్చంటున్నారు. ఇప్పటికే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు గడువు కోరారు శ్రీహరి. ఈ విషయంలో న్యాయపరంగా వచ్చే చిక్కుల గురించి ఆరా తీస్తున్నారట ఆయన. ఏ రూపంలోనూ వెసులుబాటు దొరక్క… ఇక ఉప ఎన్నిక తప్పదని అనుకుంటే… ఆయన అందుకు కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతంతన నియోజక వర్గ అభివృద్ధి మీదే ఫోకస్ పెట్టారట ఆయన. సీఎం రేవంత్‌రెడ్డి దగ్గరికి వచ్చిన ప్రతిసారి వివిధ అభివృద్ధి పనుల కోసం అనుమతులు తీసుకెళ్తున్నారు. మొత్తం మీద ఒక వేళ తేడావచ్చినా… నేను రెడీ అన్న సంకేతాలు పంపుతున్నారు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే. ఇక మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో కూడా.. ఇదే తరహా చర్చ నడుస్తోంది. ఓ వైపు ప్రభుత్వానికి వ్యతిరేక కామెంట్స్ చేస్తూ.. తన డిమాండ్స్ నెరవేర్చేలా దారిలోకి తెచ్చుకోవాలని మొదట భావించారు దానం. కానీ అది వర్కవుట్ కాక పోగా… కాంగ్రెస్‌లోనే ఆయనపై కొంత వ్యతిరేక అభిప్రాయం వచ్చింది.
Read Also: Asia Cup 2025: ఆసియా కప్‌కు వేళయరా.. వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇలా!
ఇంతలో అనర్హత పిటిషన్స్ అంశం సీరియస్ అయింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం చూస్తే… కడియం శ్రీహరికంటే ఎక్కువగా ఇరుక్కుపోయారు నాగేందర్. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే… లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారాయన. సాక్ష్యాధారాలు డైరెక్ట్‌గా కనిపిస్తున్నాయి కాబట్టి… కడియం విషయంలో కాస్త అటుఇటైనా…దానం మీద మాత్రం వేటు తప్పదేమోనన్న అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. అయితే… అంతకంటే ముందే రాజీనామా చేసి.. ఆయన ఖైరతాబాద్ బరిలో ఉండాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో అందుకు పార్టీ ఓకే చెప్తుందా..? అన్న అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదనే ఫోకస్ పెట్టింది. ఎలాంటి కీలక నిర్ణయం అయినా… ఆ తర్వాతనే తీసుకునే అవకాశం ఉంది. ఇలా… ఓవరాల్‌గా చూసుకుంటే… పార్టీ మారిన పది మందిలో ఇద్దరు మాత్రం గట్టిగానే ఇరుక్కున్నట్టు కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. వాళ్ళ మీద వేటు తప్పదని అనుకుంటే మాత్రం రాజీనామానే అంతిమ నిర్ణయంగా కనిపిస్తోంది.
