Off The Record: గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షలో సీఎం జగన్ ఇచ్చిన సీరియస్ వార్నింగ్ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల్లో హై టెన్షన్ పుట్టిస్తోంది. కార్యక్రమంలో సరిగా పాల్గొనని 18 మంది ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు సీఎం. అయితే.. ఆ 18 మంది ఎవరన్నదే ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. పేర్లను సమావేశంలో ప్రకటించ లేదు. వ్యక్తిగతంగా పిలిపించి మాట్లాడతాను, గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే గ్రాఫ్ పెరగదని స్పష్టం చేశారు సీఎమ్. ఏడాది కాలంగా కార్యక్రమం మీద ఎంత ఫోకస్ పెట్టినా…ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించాలని చెబుతున్నా…ఆ 18 మంది ఎందుకు లైట్ తీసుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికైతే…వాళ్ళందరి గ్రాఫ్ నెగెటివ్ మోడ్ లో ఉన్నట్లే. ఇక మరో మూడు నాలుగు నెలల్లో అభ్యర్ధుల తుది జాబితా సిద్ధమవుతుందని ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చేశారు. గెలిచే వారికే టికెట్లు అన్న విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టేశారు జగన్. అంటే వెనుకబడిన ఆ 18 మంది తిరిగి టికెట్ దక్కించుకే లిస్ట్‌లో లేనట్టే కదా అన్న చర్చపార్టీ వర్గాల్లో జరుగుతోంది. అందుకే ఆ లిస్ట్ మీద అంత ఆసక్తి పెరుగుతోంది.
సీఎం ఇచ్చిన సీరియస్ వార్నింగ్‌తో రాడార్ పరిధిలో ఉన్న ఆ 18 మంది ఎవరన్న చర్చ వైసీపీ వర్గాల్లో సెంటర్ ఆఫ్ ద డిస్కషన్ అయ్యింది. ఇప్పటికే కొందరి పేర్లు పార్టీ సర్కిల్స్‌లో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇక్కడే మరో డౌట్ కూడా వస్తోంది. పని తీరు మెరుగు పరుచుకోని, గ్రాఫ్ పెంచుకోని ఎమ్మెల్యేలను జగన్ పిలిచి మాట్లాడతారా లేక టికెట్ ఇవ్వనని ముఖం మీదే నిర్మొహమాటంగా చెప్పేస్తారా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అలా చెబితే ఆ ఎమ్మెల్యేలు రిసీవ్ చేసుకుంటారా…కప్పదాట్లు పెరుగుతాయా…అన్న చర్చ కూడా పార్టీ అంతర్గత వర్గాల్లో జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జరిగిన అనుభవాన్ని గుర్తు చేస్తున్నారు. మీకు టికెట్ ఉండదని సీఎమ్ నేరుగా చెప్పిన ఎమ్మెల్యేలు టీడీపీతో చేతులు కలిపి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారన్నది నాడు అనునమానంతో కూడిన అనుభవం.
ఒక విషయం పై అయితే పార్టీ వర్గాల నుంచి క్లారిటీ వస్తోంది. హిట్ లిస్ట్ లో ఉన్న ఈ 18 మందిలో కూడా కేటగిరీలు ఉంటాయట. అందర్నీ క్యాంపు కార్యాలయానికి పిలిచి ఫైనల్ వార్నింగ్ అయితే ఇస్తారట. కానీ… గెలిచే అవకాశం లేదన్న స్పష్టతకు వచ్చిన ఎమ్మెల్యేలను మాత్రం పక్కన పెట్టేస్తారని అంటున్నారు. దృష్టి పెడితే మెరుగుపడతారని రిపోర్ట్ ఉన్న వారికి మాత్రం లాస్ట్ ఛాన్స్ ఉంటుందట. ఎవరిని ఎప్పుడు పిలవాలన్న షెడ్యూల్ కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. సీఎమ్ హెచ్చరికతో ఆరోపణలు ఉన్న, పని తీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేల్లో హై రేంజ్ లో టెన్షన్ మొదలైందని టాక్. ఎనవరై ఉంటారని ఎవరికి వారు ఆరాలు తీయడంలో బిజీ అయిపోయారట.