Off The Record: కేటీఆర్ కోసం వైటింగా..? బీఆర్‌ఎస్ పెండింగ్ సీట్ల అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: సింగిల్ షాట్‌లో 115 నియోజకవర్గాలకు అభ్యర్దులను ప్రకటించిన కేసీఆర్.. మరో నాలుగు సెగ్మెంట్స్‌ని మాత్రం పెండింగ్‌లో పెట్టారు. వాటిలో హైదరాబాద్ పాత బస్తీకి సంబంధించిన రెండిటి గురించి ఎవరూ పెద్దగా ఆలోచించడం లేదుగానీ.. ఇంకో రెండు నియోజకవర్గాల విషయంలో మాత్రం ఎక్కడలేని ఉత్కంఠ కొనసాగుతోంది. జనగామ, నర్సాపూర్ అభ్యర్థులుగా ఎవర్ని ఎంపిక చేస్తారు? అసలు ఎందుకు పెండింగ్‌లో పెట్టారన్న చర్చోపచర్చలు పార్టీల జరుగుతున్నాయి. ఎవరికి నచ్చిన విశ్లేషణలు వారు చేసేస్తుండటంతో కంగాళీ ఇంకా ఎక్కువ అవుతోంది. అదే సమయంలో ఈ నియోజకవర్గాలకు అభ్యర్దులను ఎప్పుడు ప్రకటిస్తారా? అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు ఆశావహులు.
కేసీఆర్ ప్రకటన కోసం ఊపిరిబిగపట్టుకుని చూస్తున్నారు వాళ్ళు. నర్సాపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే మదనరెడ్డికి టికెట్ నిరాకరించిన కేసీఆర్.. అక్కడ ఎవరి పేరు ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టారు. మాజీ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డికి ఈ టికెట్ ఖరారు చేస్తారని ఆశించినప్పటికీ అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. తనకు టికెట్ ఇవ్వాలని మదన్ రెడ్డి అధిష్టానం మీద వత్తిడి తేవడం, ఆయనకే ఇవ్వాలంటూ నియోజకవర్గంలో అనుచరులు హంగామా చేయడం, అయినా పెద్దలు సైలెంట్‌గా ఉండటం ఆసక్తి రేపుతున్నాయి. ఈ సమయంలోనే సునీతారెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిశారట. కొంతకాలం ఆగాల్సిందేనని ఆయన సునీతారెడ్డికి తేల్చిచెప్పినట్లు సమాచారం. ముందు మదన్‌రెడ్డితో మాట్లాడి.. ఆ తరువాతే టికెట్ ఖరారు చేస్తానని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక జనగామ టికెట్ ఖరారు చేయాలనుకున్నప్పటికీ మంత్రి కేటీఆర్ అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేశారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి టికెట్ ఖరారు అయిందని ఆయన వర్గీయులు తీవ్రస్థాయిలో ప్రచారం చేసుకుంటున్నారు. పల్లా కూడా జనగామ నియోజవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులకు అందుబాటులోకి వెళ్లిపోయారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టికెట్ నిరాకరించిన క్రమంలో జనగామ టికెట్ కోసం పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా పోటీపడ్డారు. పోచంపల్లికి కేటీఆర్ క్లాస్‌మేట్. తనకు టికెట్ కావాలని పట్టుపడుతున్న పోచంపల్లి కేటీఆర్ ఆమెరికా పర్యటన ముగించుకుని వచ్చే వరకు జనగామ టికెట్ ఖరారు కాకుండా కేసీఆర్‌పై వత్తిడి తెచ్చినట్లు సమాచారం.
Also Read
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
అయితే కేసీఆర్ జనగామ టికెట్‌ను ఖరారు చేయకుండా కేటీఆర్ వచ్చేదాకా ఆగుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక నాంపల్లి, గోషామహల్ సీట్ల విషయంలో మిత్రపక్షమైన ఎంఐఎం సలహా తీసుకుని కేసీఆర్ ఖరారు చేస్తారని సమాచారం. ఇంకా ఎంఐఎం నుంచి సూచన రాలేదని, రాగానే ఆయా స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేస్తారని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఇక మైనంపల్లి పార్టీ వీడీనా, పార్టీ నుంచి సస్పెండ్ అయినా… ఆ స్థానానికి కూడా కేటీఆర్ వచ్చాకే అభ్యర్దిని ఖరారు చేస్తారని అంటున్నారు. సో కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తరువాతే… బీఆర్‌ఎస్ పెండింగ్ సీట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!