Off The Record: రాయలసీమ బలిజల మొగ్గు ఎటువైపు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: గత ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టింది గ్రేటర్ రాయలసీమ. ఇక్కడ దాదాపుగా అన్ని అన్ని సామాజిక వర్గాలు ఆ పార్టీకి అండగా నిలిచాయి. కానీ.. ఈసారి మాత్రం అందులో బలిజల సహకారం అనుమానమేనంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాపులనే రాయలసీమలో బలిజలుగా పిలుస్తారు. కానీ.. ఈ విడత సీమలో ఆ సామాజికవర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు వైసీపీ. దీంతో వాళ్లంతా గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాల్లో బలిజల ఓట్లు చెప్పుకోతగ్గ స్థాయిలో ఉన్నాయి. దాదాపు పాతిక నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయి వాళ్ళది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే ఏకంగా మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో బలిజల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. రాజంపేట లోక్‌సభ పరిధిలో ఏకంగా మూడు లక్షల ఓట్లు ఉన్నాయి. ఇక తిరుపతి పార్లమెంటులో అయితే తిరుపతి, గూడూరు, కాళహస్తి, సర్వేపల్లి అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో ఎక్కువుగా ఉన్నారు బలిజలు.
కర్నూలు జిల్లాలో ఆళ్ళగడ్డ, నంద్యాల, కర్నూలు సిటీ, ఎమ్మిగనూరు, ఆదోనిలో వీరి ప్రభావం ఎక్కువ. గత ఎన్నికల్లో వీరి వల్ల అత్యధికంగా లబ్ది పొందింది కూడా వైసీపీయేనన్నది ఓ పరిశీలన. అయినాసరే.. ఈ విడత మొత్తం 52 నియోజకవర్గాల్లో ఎక్కడా బలిజ అభ్యర్థికి అవకాశం ఇవ్వలేదు అధికార పార్టీ. దీంతో తీవ్రంగా రగిలిపోతున్నారట ఆ సామాజికవర్గం నేతలు. దీనికితోడు తనకు రాజ్యసభ ఇస్తామని చెప్పి.. హ్యాండిచ్చారంటూ జనసేనలో చేరిపోయారు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. అదే సమయంలో ఆయనకు తిరుపతి టిక్కెట్ ఇచ్చింది జనసేన. అటు రాజంపేటలో కాపు నేత బాల సుబ్రమణ్యంకు టిక్కెట్ ఇచ్చింది టీడీపీ. ఇలా కూటమిలోని రెండు పార్టీలు చెరో సీటు బలిజలకు ఇవ్వడంతో తమకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నది వైసీపీ నేతల అభిప్రాయంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ఎఫెక్ట్ పడకుండా పెద్దిరెడ్డి లాంటి వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. బలిజలకు కీలమైన పదవులు ఇచ్చామని, ప్రాధాన్యత పరంగా ఎలాంటి డౌట్స్ అవసరం లేదని వివరిస్తున్నారట. ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని విధంగా రాయలసీమలో ప్రచారానికి టిడిపి వంగవీటి రాధాను దింపింది. దీంతో పరిస్థితులు ఎక్కడ చేయిదాటి పోతాయోనని వైసీపీ పెద్దలు కంగారు పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
వంగవీటి రాధా ఇప్పటికే చిత్తూరు, మదనపల్లె నియోజకవర్గాల్లో కూటమి తరపున ప్రచారం చేశారు. త్వరలో చంద్రగిరి, పుంగనూరు, నగరి సహా బలిజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పర్యటించేలా రూట్ మ్యాప్ రెడీ అవుతోందట. ఇప్పటికే సీటు ఇవ్వకపోవడంతో ఆగ్రహంగా బలిజలు.. రాధా ప్రచారంతో ఎలా రియాక్ట్ అవుతారోనన్న చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించిన పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డి వద్ద కొద్దిమంది పార్టీ నేతలు తాజా పరిస్థితిని ప్రస్తావించినట్టు సమాచారం. బలిజల ఓట్లు దూరమైతే.. మదనపల్లి, పుంగనూరు, పీలేరు, తంబళ్ళపల్లి, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలలో ఇబ్బంది ఉంటుదని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారట. దీంతో ఇప్పుడు వైసీపీ పెద్దల అడుగులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బలిజ ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల అభ్యర్థుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో వంగవీటి రాధా ప్రచారం ప్రభావం ఎంతమేర ఉంటుందన్నది కూడా ఇంట్రస్టింగ్ పాయింట్ అయింది.
తాజావార్తలు
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!