Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Anantapur Clock Tower Flyover Credit Politics

Off The Record: టీడీపీ, వైసీపీ మధ్య క్రెడిట్‌ వార్‌.. . క్లాక్ టవర్ ఫ్లై ఓవర్ మా వల్లే..!

Published Date :June 21, 2023 , 11:01 pm
By Sudhakar Ravula
Off The Record: టీడీపీ, వైసీపీ మధ్య క్రెడిట్‌ వార్‌.. . క్లాక్ టవర్ ఫ్లై ఓవర్ మా వల్లే..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Off The Record: ఏపీలో ఇప్పుడు ఏ అభివృద్ధి పని జరిగినా క్రెడిట్‌ వార్‌ మాత్రం కామనైపోయింది. మేం పునాది వేశామని ఒకరంటే… మేం పూర్తి చేశామని మరొకరు కౌంటరిస్తూ… పొలిటికల్‌ హీట్‌ పెంచేస్తున్నారు. పై నుంచి కింది దాకా అన్ని దశల్లో ఇదే వరస. ఇప్పుడు అనంతపురంలోని ఓ వంతెన కూడా ఈ వార్‌లో నలిగిపోతూ… అసలు నన్నెందుకు కట్టార్రా నాయనా…అని ఆత్మఘోష వెళ్ళబోసుకుంటోందట. అనంతపురం వాసుల ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పెడుతూ… టవర్ క్లాక్ దగ్గర ఫ్లైవోవర్‌ నిర్మించారు. గతంలో ఇక్కడున్న పాత బ్రిడ్జి బాగా దెబ్బతిని.. పెరిగిన ట్రాఫిక్ కి అనుకూలంగా లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో అనంతపురం మీదుగా చెన్నై- బళ్లారి జాతీయ రహదారి విస్తరణ పనులు జరిగాయి. ఈ ప్రతిపాదన చాలా ఏళ్ల నుంచి ఉన్నా.. వైసీపీ అధికారంలోకి వచ్చాక పనుల వేగం పెరిగింది.

సుమారు 311 కోట్లతో జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అనంతపురం ఎంట్రన్స్‌లో ఉన్న పంగల్ రోడ్డు నుంచి బళ్లారి రోడ్డు వరకు విస్తరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా టవర్ క్లాక్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. 15 నెలల్లోనే పాత బ్రిడ్జి కూల్చివేయడం, కొత్తగా రెండు వరుసల్లో కొత్త ఫ్లై వోవర్‌ కట్టడం జరిగిపోయాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల నగర రూపు కూడా మారిందన్నది లోకల్‌ టాక్‌. సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కొత్త బ్రిడ్జి మీద వైసీపీ నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అదే రోజు రాత్రి విద్యుత్ దీపాల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ క్రెడిట్ అంతా వైసీపీదేనని చెబుతున్నారు ఆ పార్టీ నాయకులు. సరిగ్గా ఇక్కడే టిడిపి నేతలు ఎంటరైపోయారు. అసలు ఈ ఫ్లైవోవర్‌ మా పుణ్యమేనంటూ ప్రచారం మొదలుపెట్టారు. గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి దగ్గరికి చాలాసార్లు వెళ్లి బ్రిడ్జి కోసం ప్రయత్నాలు చేశామని, అది టీడీపీ హయాంలోనే మంజూరైందని చెప్పుకుంటున్నారట ఆ పార్టీ నేతలు. దీని మీద వైసిపి, టిడిపి నాయకుల మధ్య మాటలు యుద్ధం జరుగుతోంది. మేం శాంక్షన్‌ చేయించుకు వచ్చామన్నది టీడీపీ వెర్షన్‌ కాగా…అంత సీన్‌ ఉంటే.. పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారన్నది వైసీపీ క్వశ్చన్‌.

Also Read

  • Bottle Gourd Moong Dal Cheela Recipe: బ్రేక్‌ఫాస్ట్‌ కోసం కరకరలాడే సొరకాయ-పెసరపప్పు చిల్లా.. ఒకసారి చేస్తే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది!
  • Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
Add as a preferred
source on google

ఆ రెండు పార్టీలు అలా పోట్లాడుకుంటే… మేమున్నామంటూ మధ్యలో ఎంటరైపోయారు బీజేపీ నాయకులు. బ్రిడ్జి క్రెడిట్‌ మొత్తం మాదంటూ గట్టిగా వాయిస్‌ వినిపిస్తున్నారు. మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతో వంతెన కడితే… మధ్యలో మీ పెత్తనమేందన్నది కాషాయ పార్టీ క్వశ్చన్‌. కష్టమైనా నష్టమైనా అంతా మాదేనని, క్రెడిట్‌ మాకే దక్కాలని అంటున్నారట బీజేపీ నేతలు. మేం తెచ్చిన నిధులతో వాళ్ళు సోకులు చేసుకుంటున్నారని విమర్శిస్తోంది అనంతపురం కమలదళం.
అసలు మాది, మీది అని కొట్టుకోవడానికి వీళ్లంతా ఎవరు? అది జనం సొమ్ముతో… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జరిగిన నిర్మాణం కదా అన్నది కామన్‌ మ్యాన్‌ వాయిస్‌. ఆ విషయాన్ని పక్కనబెట్టి మూడు పార్టీలు క్రెడిట్‌ వార్‌కు దిగడం జిల్లాలో పొలిటికల్‌ హీట్‌ పెంచుతోంది.

నిర్మాణ పరమైన క్రెడిట్‌ కోసం కొట్టుకోవడం ఒక ఎత్తయితే….ఇప్పుడు ఇంకో రకమైన రాజకీయం రంజుగా నడుస్తోంది. బ్రిడ్జిని అయితే తాత్కాలికంగా ప్రారంభించారు..కానీ.. ఇంకా పేరు పెట్టలేదు. సీఎం జగన్ చేత గ్రాండ్‌గా రిబ్బన్‌ కత్తిరించి బ్రిడ్జికి పేరు పెట్టాలని భావిస్తున్నారు వైసీపీ నాయకులు. మిగిలిన పార్టీలు, ప్రజా సంఘాలు మాత్రం పూలే, అంబేద్కర్, అబ్దుల్‌ కలాం, తరిమెల నాగిరెడ్డి ,నీలం సంజీవరెడ్డి ఇలా రకరకాల పేర్లు సూచిస్తున్నాయి. ఈ విషయంలో కూడా పొలిటికల్‌ వార్‌ జరుగుతూనే ఉంది. జనం మాత్రం క్రెడిట్‌ ఎవరన్నా తీసుకోనీ… ఎవరి పేరైనా పెట్టుకోనీ…మాకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తీరాయని హ్యాపీగా ఉన్నారు. రాజకీయ నాయకుల బారసాల తిప్పల్ని మాత్రం ఆసక్తిగా గమనిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anantapur
  • Andhra Pradesh
  • Clock Tower Flyover
  • Credit Politics
  • off the record

తాజావార్తలు

  • Axar Patel-DC: వచ్చే ఏడాది చూసుకుంటాం.. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Bottle Gourd Moong Dal Cheela Recipe: బ్రేక్‌ఫాస్ట్‌ కోసం కరకరలాడే సొరకాయ-పెసరపప్పు చిల్లా.. ఒకసారి చేస్తే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది!

  • Peddi: ‘పెద్ది’ సెట్స్‌లో మెగాస్టార్ సందడి..

  • Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు

  • KL Rahul IPL Record: ఐపీఎల్‌లో కోహ్లీకే సాధ్యం కాని ఘనత.. చరిత్ర సృష్టించిన రాహుల్!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions